లోక్ సభ ఎన్నికల ప్రచారం.. కేంద్రమంత్రి అమిత్‌షాకు తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భారీ ప్రమాదం తప్పింది. బీహార్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో హెలీకాఫ్టర్ లో సమస్య తలెత్తడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భారీ ప్రమాదం తప్పింది. బీహార్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో హెలీకాఫ్టర్ లో సమస్య తలెత్తడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం హోరీహోరీగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన లీడర్లు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల్లో కలియతిరుగుతున్నారు. పార్టీల్లోని ప్రధాన రాజకీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. కేంద్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా బీహార్ లో అమిత్ షా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. హెలీకాఫ్టర్ లో సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.

సభ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అమిత్‌ షా హెలీకాప్టర్‌లో బయలుదేరారు. ఈ సమయంలోనే హెలీకాప్టర్‌ బ్యాలెన్స్‌ కోల్పోయింది. పక్కకు ఒరిగిపోయి దాదాపు నేలను తాకబోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం చోటుచేసుకుంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. చివరకు పరిస్థితి చక్కబడడంతో హెలీకాప్టర్‌ సురక్షితంగా టేకాఫ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక అమిత్ షాకు ప్రమాదం తప్పడంతో అధికారులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

Show comments