వీడియో: బస్సులో సీటు కోసం తోటి మహిళను చావకొట్టింది!

కర్ణాటకలో మహిళల ఫ్రీ బస్‌ జర్నీ పథకం వివాదాల్లో సాగుతోంది. ఫ్రీ బస్సు ప్రయాణం కోసం మహిళలు కొట్టుకు చస్తున్నారు. నిత్యం ఎక్కడో చోట సీటు కోసం మహిళా ప్రయాణికులు కొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఓ మహిళ మరో మహిళపై దారుణంగా దాడి చేసింది. గొడవను ఆపడానికి వచ్చిన వారితో కూడా గొడవకు దిగింది.

కొద్దిరోజుల క్రితం కర్ణాటక ఆర్టీసీకి చెందిన ఓ బస్సు ప్రయాణికుల కోసం బస్‌స్టాప్‌లో ఆగింది. అందులోకి కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. ఆ తర్వాత ఓ సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఓ మహిళ మరో మహిళపై రెచ్చిపోయింది. ఆమెను సీటుకు అదిమి పట్టి, జుట్టును చేతుల్లో​కి తీసుకుంది. తర్వాత జుట్టు పట్టుకుని అటు, ఇటు ఊపసాగింది. గట్టిగా అరుపుస్తూ,బూతులు తిట్టసాగింది. దీంతో అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు ఆమెను ఆపటానికి ప్రయత్నించాడు.

అయినా, ఆమె వినలేదు. అతడిపైకే తిరగబడింది. మహిళతో పాటు అతడిపై కూడా దాడికి దిగింది. దీన్నంతా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. ఆ వీడియో తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఫ్రీ బస్‌.. ఫ్రీ బస్‌ అని ఆడోళ్ల మధ్య గొడవలు పెడుతున్నారు’’.. ‘‘ ఇలాంటి సంఘటనలు కర్ణాటకలో చాలా ఎక్కువయిపోయాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, బస్సులో చోటుచేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments