వీకెండ్‌లో సరదాగా KFCలో ఫుడ్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త!

వీకెండ్ ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లి.. సినిమా చూసి.. KFCలో చికెన్ వింగ్స్ లేదా చికెన్ బకెట్ తెచ్చుకుని తిందామనుకుంటున్నారా...? అయితే ఈ వార్త ఒక్కసారి చదవండి.. ఆ తర్వాత మీ ఇష్టం..

వీకెండ్ ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లి.. సినిమా చూసి.. KFCలో చికెన్ వింగ్స్ లేదా చికెన్ బకెట్ తెచ్చుకుని తిందామనుకుంటున్నారా...? అయితే ఈ వార్త ఒక్కసారి చదవండి.. ఆ తర్వాత మీ ఇష్టం..

క్రిస్పీ చికెన్ వింగ్స్ తినాలపిస్తే.. ఛలో కేఎఫ్‌సి. పెరీ పెరీ చికెన్ తినాలన్నా, బర్గర్ విత్ కోక్ లేదా ఏదైనా కాంబో కావాలనుకుంటే దాన్నిక్కూడా కేరాఫ్ అడ్రస్ కేఎఫ్‌సినే. ఇక స్పెషల్ డేస్, స్పెషల్ ఆఫర్స్ పెడితే.. ఇక చెప్పనక్కర్లేదు చిన్న చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ రెస్టారెంట్‌లో వాలిపోవాల్సిందే. వెళ్లే ఓపికా లేకపోతే ఆర్డర్ అయినా పెట్టుకోవాల్సిందే. ఎందుకుంటే కేఎఫ్‌సి ఉండే ఫ్యాన్స్ బేస్ అలాంటిది. ఆ రంగు, రుచికి చాలా మంది టెంప్ట్ అయిపోతుంటారు. లొట్టలు వేసుకుని తింటుంటారు. దీనికుండే బ్రాండ్ వాల్యూ వల్ల కూడా కేఎఫ్‌సిలో తినేందకు ఆసక్తి చూపుతుంటారు. ఇది నిజమని నమ్మితే.. మీ ఆరోగ్యాన్ని మీ చేతులతోనే కిల్ చేసుకున్నట్లే. ఎందుకంటే.. ఈ ప్రముఖ రెస్టారెంట్‌లో కూడా కల్తీ చోటుచేసుకుంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్ మెంట్ అధికారులు సోదాలు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కాదు.. తెలుగు వారు ఎక్కువ ఉండే బెంగళూరు నగరిలోని ఓ కేఎఫ్‌సి రెస్టారెంట్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తాజాగా కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ రెస్టారెంట్లపై సోదాలు చేపట్టారు. అందులో కేఎఫ్‌సి కూడా ఉంది. దేవనహళ్లి KFC రెస్టారెంట్, దేవ్ యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ పై కూడా సోదాలు చేశారు. ఈ సమయంలో ఆహారం తయారీలో సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌తో కూడిన నూనెను వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నూనెలు శుద్ది చేసేందుకు సింథటిక్ మెగ్నీషియం యూజ్ చేస్తున్నారని తేలింది. దీంతో వాడిన వంట నూనెలను మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రెస్టారెంట్ లైసెన్స్‌ను 14 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ఇక్కడే కాదు గత నెలలో కూడా తమిళనాడులో కూడా కేఎఫ్ సి రెస్టారెంట్ పై సోదాలు చేయగా.. వంట నూనెలో సింథటిక్ మెగ్నీషియం సిలికేట్ వినియోగిస్తున్నట్లు తేలింది. తూత్తుకుడిలోని వెలవన్ హైపర్ మార్కెట్‌లోని KFC యూనిట్‌పై సోదాలు చేపట్టినప్పుడు ఈ డొల్లతనం బయటపడింది. అప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ సస్పెండ్ చేసింది. అంతలో బెంగళూరులోని కేఎఫ్‌సిలో కూడా ఇదే తీరు వెలుగుచూసింది. దీన్ని బట్టి చూస్తే కేఎఫ్ సి అందించే ఫుడ్ ఐటమ్స్ పై అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. కేఎఫ్‌సి అంటేనే నూనెలో దోరగా వేయించి తీసే వస్తువులకు ప్రసిద్ది. చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర ఫుడ్ ఐటమ్స్ కూడా ఇదే జాబితాలోకి వస్తాయి.  అయితే వాడిన నూనె మళ్లీ  వినియోగిస్తే అనారోగ్యాలకు దారి తీస్తుందన్న విషయ తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే.  ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఏపీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ రెస్టారెంట్స్, హోటల్స్ మీద సోదాలు చేపట్టిన సంగతి విదితమే.

Show comments