గవర్నమెంట్ జాబ్ కోసం అక్కాచెల్లెళ్లు చీటింగ్.. ఏం చేశారో తెలుసా?

Rajasthan: ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రజలు హద్దులు దాటుతున్నారు.. పేపర్ లీక్ చేయడం, లంచాలు ఇవ్వడం, నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందడం లాంటివి చేస్తున్నారు.

Rajasthan: ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రజలు హద్దులు దాటుతున్నారు.. పేపర్ లీక్ చేయడం, లంచాలు ఇవ్వడం, నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందడం లాంటివి చేస్తున్నారు.

ప్రభుత్వం ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అన్నట్టే లెక్క. ఉన్నత చదువులు చదివిన వారైనా సరే కనీసం అటెండర్ ఉద్యోగం వచ్చినా మహాభాగ్యం అనుకునే కాలం ఇది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షలు లంచాలు సమర్పిస్తుంటారు. ఈ మధ్య కాలంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అర్హత లేని వారు సైతం గవర్నమెంట్ జాబ్స్ కొట్టేస్తున్నారు. అసలు నిజం బయట పడే వరకు దర్జాగా ఉద్యోగాలు చేస్తూ అడ్డగోలుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన ఘనకార్యం చూసి అధికారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం బీవర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అక్కాచెల్లెళ్లిద్దరూ నకిలీ వితంతు సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. సునిత అనే మహిళ తన అక్క బావమరిది మరణ డెత్ సర్ఫిఫికెట్ సమర్పించి ఉద్యోగం సంపాదించింది. తనను తాను వితంతువుగా ప్రకటించింది. చెల్లెలు రేఖ అదే గ్రామానికి చెందిన మదన్ అనే అబ్బాయిని మరణ దృవీకరణ పత్రి సమర్పించి వింతవు కోటా కింద జాబ్ సంపాదించింది. ఇద్దరూ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. సునిత ఖర్లా ఖేడా బేవార్ లో ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్ లో పని చేస్తుండగా.. రేఖ రాజ్ సమంద్ జిల్లా బద్నీలోని ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్ లో పనిచేస్తుంది.

2022 టీచర్ రిక్రూట్ మెంట్ లో సునితా చౌహాన్, 2016-17 రిక్రూట్ మెంట్ లో రేఖ టీచర్ జాబ్ లు సంపాదించినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ వితంతు కేటగిరిలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. వీరు సమర్పించిన వితంతు సర్ఫిఫికెట్స్ ఫ్రాడ్ అని నిర్ధారణ కావడంతో అసలు నిజం బయటపడింది. సునితా చౌహాన్ తన బావమరిది ఛగల్ లాల్ మరణ ధృవీకరణ పత్రం సమర్పించగా.. ఛగల్ లాల్ కు వివాహం అయ్యింది. అతని భార్య ఇంకా బతికే ఉంది. అతడు చనిపోయినట్లు భార్య ప్రమాద బీమా మొత్తాన్ని పొందింది. కానీ, అతని మరణ ధృవీకరణ పత్రం మాత్రం సునిత వాడుకుంది. సునిత ఉదయ్ పూర్ కు చెందిన నిర్మల్ సింగ్ ని 25 నవంబర్, 2020 లో వివాహం చేసుకుంది.

ఇక రేఖ చౌహాన్ విషయానికి వస్తే.. తన గ్రామానికి చెందిన మదన్ సింగ్ అనే యువకుడి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించింది. పాలిలోని సోజిత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదన్ సింగ్ చనిపోయాడు.. మదన్ సింగ్ అవివాహితుడు కావడంతో అతని మరణం తర్వాత ప్రమాద బీమా తల్లిదండ్రులు పొందారు. కానీ, మదన్ మరణ ధృవీకరణ పత్రాన్ని రేఖ ఉపయోగించుకొని టీచర్ ఉద్యోగం సంపాదించింది. ఇలా నకిలీ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినట్లు ఇటీవల అధికారుల దృష్టికి వచ్చింది. ఇదిలా ఉంటే ఇద్దరు అక్కాచెల్లెళ్లకు రాజకీయ పలుకుబడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం.

Show comments