వారికి ర్యాపిడో గుడ్ న్యూస్.. ఆ ఒక్కరోజు మాత్రం ఫ్రీ రైడ్..

వారికి ర్యాపిడో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఒకరోజు డబ్బులు చెల్లించే అవసరం లేకుండా ఫ్రీగా రైడ్ చేయవచ్చునని కంపెనీ తెలిపింది.

వారికి ర్యాపిడో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఒకరోజు డబ్బులు చెల్లించే అవసరం లేకుండా ఫ్రీగా రైడ్ చేయవచ్చునని కంపెనీ తెలిపింది.

ఇప్పుడు చాలా మంది ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ కంపెనీలు అందించే సేవలను వినియోగించుకుంటున్నారు. హెవీ ట్రాఫిక్ లో ఫాస్ట్ గా వెళ్లాలంటే బైక్ ట్యాక్సీలే దిక్కు. పైగా ఛార్జెస్ కూడా తక్కువగా ఉండడంతో చాలా మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. బైక్స్ ని బుక్ చేసుకుని ఇంటి నుంచి ఆఫీసులకు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తుంటారు. అయితే కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల డిస్కౌంట్స్ ని, ఆఫర్స్ ని ప్రకటిస్తుంటాయి కంపెనీలు. పబ్లిసిటీ కోసం అప్పుడప్పుడూ ఫ్రీ రైడ్స్ ని ప్రకటిస్తుంటాయి కంపెనీలు. తాజాగా ర్యాపిడో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఒక్కరోజు ఉచిత రైడ్ ని ఆఫర్ చేసింది. అయితే ఫ్రీగా బైక్ ఎక్కే అర్హత ఎవరికి ఉంది? ఆ ఒక్కరోజు ప్రత్యేకత ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. 

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తయ్యింది. మరో రెండు రోజుల్లో రెండో దశ పోలింగ్ కూడా జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా.. పోలింగ్ శాతాన్ని పెంచేలా.. పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బైక్ ట్యాక్సీ కంపెనీ ర్యాపిడో ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ రోజున ఓటర్లకు ఉచిత రైడ్ కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫ్రీ రైడ్ కేవలం వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే అని కంపెనీ తెలిపింది.

సీనియర్ సిటిజన్లను, దివ్యాంగులను ఇంటి నుంచి కర్ణాటకలోని పోలింగ్ కేంద్రాలకు ఫ్రీగా తీసుకెళ్లనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వారికి మాత్రమే ఈ ఉచిత రైడ్ సదుపాయం వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెల 26న కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని.. సవారీ జిమ్మడారీకీ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ర్యాపిడో సంస్థ ప్రకటనలో తెలిపింది. దివ్యాంగులు, వృద్ధులు ఈ సేవను వినియోగించుకోవాలని కోరింది. బెంగళూరు, మైసూర్, మంగళూరు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేవారు ఓట్ నవ్ అనే కోడ్ ద్వారా ఉచిత రైడ్ ని పొందాలని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల తేదీ దగ్గర పడినప్పుడు ఓటర్లకు ఓటు వేసేందుకు ఉచిత రైడ్ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Show comments