Keerthi
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇక నుంచి సిగ్నల్ జంప్ చేసేవారికి ట్రాఫిక్ చలాన్లు వేయం అంటూ ట్రాఫిక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ఇంతకి ఎక్కడంటే..
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇక నుంచి సిగ్నల్ జంప్ చేసేవారికి ట్రాఫిక్ చలాన్లు వేయం అంటూ ట్రాఫిక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరం లేదు. ఇక ఈ ట్రాఫిక్ సమస్యలకు తోడు రోడ్డు ప్రమాదాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ ప్రమాదాలనేవి ఆరికట్టేందుకు అనేక రకాల ట్రాఫిక్ రూల్స్ ను అధికారులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఈ ట్రాఫిక్ నిబంధనల వలన నగరంలోని రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టవచ్చు. అందుకోసమే వాహనదారులు ఇంటి నుంచి రోడ్డు మీదకి వాహనం ఎక్కిస్తే చాలు.. హెల్మెట్, లైసెన్స్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, రాష్ డ్రైవింగ్ వంటి రకరకాల కారణాలతో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలను క్లిక్ చేయడం, చలన విధించడం వంటి చేస్తుంటారు. దీంతో వాహనం తీసుకొని రోడ్డు మీదకి ఎక్కాలంటే చాలామంది ప్రయాణికులు భయపడుతుంటారు. అయితే తాజగా ట్రాఫిక్ లో సిగ్నల్ జంప్ చేసేవారికి ఈ ట్రాఫిక్ ఫైన్లు వేయమని ట్రాఫిక్ పోలీసులు ప్రకటన చేశారు. ఇంతకి ఎక్కడంటే..
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇక నుంచి సిగ్నల్ జంప్ చేసేవారికి ట్రాఫిక్ చలాన్లు వేయం అంటూ ట్రాఫిక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. అయితే దానికి ఒక కారణం ఉంది. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు దారి ఇచ్చే సమయంలో మాత్రమే సిగ్నల్ జంప్ చేసేవారికి ఈ ట్రాఫిక్ ఫైన్లు వేయమని స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ అనేవి మన దగ్గర అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఈ కొత్త రూల్స్ అనేవిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు తీసుకువచ్చారు. అయితే ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలు విన్న ప్రయాణికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ కొత్త రూల్ వల్ల ట్రాఫిక్ కష్టాల నుంచి అంబులెన్స్‌లకు మోక్షం లభిస్తుందని అంటున్నారు.
ఇకపోతే బెంగళూరు నగరంలో ఇక నుంచి వాహనదారులు అంబులెన్స్‌లకు దారి ఇచ్చి ట్రాఫిక్ సిగ్నల్‌లను ఉల్లంఘించి ముందుకు వెళ్లిన ఎలాంటి ఫైన్లు ఉండవని తేల్చి చెప్పారు. పైగా ఈ రూల్ వలన అంబులెన్స్‌లు సిగ్నళ్ల వద్ద చిక్కుకోకుండా నేరుగా వెళ్లిపోయేందుకు ఉపయోగపడుతుందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అలాగే ఒకవేళ అంబులెన్స్‌లకు దారి ఇచ్చే క్రమంలో పొరపాటున ఏ వాహనంపైన గానీ ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ చలాన్లు పడితే.. వారు వెంటనే బెంగళూరు నగరంలోని ఇన్‌ఫాంట్రీ రోడ్‌లో ఉన్న ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఫిర్యాదులు చేయాలని బెంగళూరు ట్రాఫిక్ విభాగం సూచించింది. దీంతో పాటు కర్ణాటక స్టేట్ పోలీస్ యాప్ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చని తెలిపింది. అయితే నగరంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అనుచేత్ వెల్లడించారు.
అయితే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉన్న కెమెరాలు ప్రతీ 5 సెకన్లకు వాహనదారుల కదలికలను రికార్డ్ చేస్తాయని.. అలాంటి సమయంలో అక్కడికి అంబులెన్స్ వస్తే.. దానికి దారి ఇచ్చేందుకు వాహనదారులు సిగ్నల్ జంప్ చేసి, ముందుకు వెళ్లినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వాహనంపై పడిన ట్రాఫిక్ చలాన్ రద్దు అవుతుందని అనుచేత్ స్పష్టం చేశారు. వీటితోపాటు అంబులెన్స్‌లను గుర్తించి ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్‌లోకి మారేలా జియోఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందుకోసం దాదాపు 80 అంబులెన్స్‌లకు జీపీఎస్‌ను అమర్చినట్లుగా కర్ణాటక ఆరోగ్య, సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి. మరి, బెంగుళూరులో తీసుకువచ్చిన ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.