Keerthi
kerala: వరద విపత్తుల నుంచి ఇప్పుడిప్పుడే కేరళ ప్రజలు కోలుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో మరో అతి పెద్ద సమస్య వచ్చిపడింది. దీంతో అక్కడ ప్రజలు ఆ సమస్యతో అల్లాడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
kerala: వరద విపత్తుల నుంచి ఇప్పుడిప్పుడే కేరళ ప్రజలు కోలుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో మరో అతి పెద్ద సమస్య వచ్చిపడింది. దీంతో అక్కడ ప్రజలు ఆ సమస్యతో అల్లాడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Keerthi
కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలు ఎంతటి బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న విపత్తు అందరీ హృదయాలను కలిచివేసింది. ఎందుకంటే.. ఆ ప్రాంతాల్లో భారీ వరదల ధాటికి కొండ చరియాలు విరిగిపడటంతో.. దాదాపు 300 మందికి పైగా మరణించారు. అలాగే 200 మందికి పైగా ప్రజలు గల్లంతు అయ్యారు. అంతేకాకుండా.. చాలామంది ఇళ్లను సైతం పొగొట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ వరద విపత్తులో నష్టపోయిన వారికి అన్ని విధలా సహాయక చర్యలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆ వరద ఉద్ధృతి నుంచి కోలుకుంటున్న ప్రజలకు తాజాగా మరో పెద్ద సమస్య వచ్చి పడింది. దీంతో అక్కడ ప్రజలు ఆ సమస్యతో అల్లాడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వరద విపత్తుల నుంచి ఇప్పుడిప్పుడే కేరళ ప్రజలు కొలుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో మరో అతి పెద్ద సమస్య వచ్చిపడింది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన వరద నీటితో అల్లాడిపోయిన ప్రజలకు ఇప్పుడు పూర్తిగా నీటి సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఈ సమస్య రాష్ట్రరాజధాని తిరువనంతపురంలో ఎక్కువగా ఏర్పడింది. అక్కడ కనీసం ఇంట్లో అవసరాలకు నీరు లేకపోవడం కాదు కదా.. కనీసం తాగటానికి కూడా మంచి నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నీటి కొరత ప్రభావం ఆ రాష్ట్రంలోని పెళ్లిలు,ఇతర ఫంక్షన్లపై పడింది. పైగా ఇటీవలే కోటలోని పాంచజన్యం ఆడిటోరియంలో అంబళాతరకు చెందిన కాలడి బాలచంద్రన్ కుమార్తె భావన, నాలంచిరకు చెందిన విశాఖల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే ఆ వేడుకల్లో అధికార సీపీఎం పార్టీ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, కాంగ్రెస్ నేత వీఎస్ శివకుమార్ తో పాటు ఇతర ప్రముఖులంతా కలిసి మొత్తం 700 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఇక ఆ వేడుకల్లో హాజరైన వీఐపీలకు నీటి కొరత చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. ఆ ఫంక్షన్ హాల్లో చేతులు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ లోని నీళ్లు విందు మధ్యలోనే అయిపోయింది. దీంతో నీటి కొరత సమస్య ఎక్కువగా ఉండటంతో.. చేసేదేమి లేక ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కూడా చేతులేత్తేశారు. అయితే వేడుకకు వచ్చిన అతిథులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వధువు బంధువులు వెంటనే చేతులు కడుక్కోవడానికి 200లకు పైగా వాటర్ బాటిళ్లను కొనుగొలు చేసిన పరిస్థితి ఏర్పాడింది. ఇక ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే తిరువనంతపురం సిటీ కార్పొరేషన్ పరిధి విషయానికొస్తే.. అక్కడ సగానిక పైగా వార్డులు నీటి కొరతను ఎదుర్కొంటుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేల బంగ్లాలలో ఉన్న వార్డుల్లో మాత్రం నీటి సమస్య లేకపోవడం గమన్హారం. ఒకవేళ అక్క నీటి కొరత వచ్చిన అధికారులు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేరళ రాష్ట్రంలోని నీటి కొరత సమస్యతో కొందరు స్థానికులు కుళాయిలకు తాళాలు వేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరీ, కేరళలో ఏర్పడిన నీటి సంక్షేభం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.