P Krishna
Durga Special: సాధారణంగా జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటోందో అనుభవించే వారికే తెలుస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తూ సొంతవారికి దూరంగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతందో తెలియని అయోమయ జీవితం గడుపుతుంటారు.
Durga Special: సాధారణంగా జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటోందో అనుభవించే వారికే తెలుస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తూ సొంతవారికి దూరంగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతందో తెలియని అయోమయ జీవితం గడుపుతుంటారు.
P Krishna
క్షణికావేశంలో తప్పులు చేసిన వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకురావడానికి కోర్టు శిక్ష విధిస్తుంది. ఖైదీలు సొంతవారికి దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెల్లదీస్తుంటారు. వాళ్లకి ఓ పండుగ , పబ్బం ఉండదు. జైలు జీవితంలో ఏ సంతోషమూ ఉండదు. అక్కడే తింటూ నలుగురితో కలిసి దయనీయమైన జీవితం జీవిస్తుంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన జీవితాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి వారి కోసం బెంగాల్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన ఆలోచించింది. ఇంతకీ ఆ ఆలోచన ఏంటీ? పోలీస్ అధికారులు ఏం నిర్ణయం తీసుకున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జైలు ఖైదీల కోసం వినూత్నమైన ఆలోచన ఆలోచించింది. ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు దసరా పండుగ సందర్భంగా దుర్గాపూజ జరిగే సమయంలో సరికొత్త మెనూ అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ ఏడాది దుర్గాపూజ వేడుకల సమయంలో జైల్లో ఉండే ఖైదీలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని నిర్ణయించింది. దుర్గామాత పూజా సందర్భంగా ఖైదీలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త మెనూ అక్టోబర్ 9 నుంచి 12 వరకు అందించనున్నారు. ఈ ఆహార పదార్ధాలు కూడా ఖైదీల చేతనే తయారు చేయించనున్నారు. ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఏడాది ఖైదీలకు దసరా పండుగ సందర్భంగా మంచి ఆహారం అందిస్తామని.. ఈసారి ఖైదీల కోరిక మేరకు ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఖైదీలకు బలవంతంగా ఆహారాన్ని అందించబోమన్నారు. ఎవరి మతాచారాల ప్రకారం నచ్చిన ఆహారాన్ని మాత్రమే అందిస్తామని అధికారులు తెలిపారు.
మెనూలో వంటకాలు ఇవే :
మటన్ బిర్యానీ విత్ రైతా
చికెన్ కర్రీ
బసంతి పులావ్
పొటోల్ చింగ్రీ
మాచర్ మాతా దియే పుయ్ షక్ (చేప తలతో మలబార్ బచ్చలి కూర)
లూచీ-చోలార్ దాల్ (చేప తలతో పప్పు)
పాయేష్ (బెంగాలీ గంజి)
ఆలు పొటాల్ చింగ్రి(పొట్లకాయ, బంగాళాదుంపతో రొయ్యలు)