బంగ్లాదేశ్‌ అల్లర్ల వెనుక కుట్ర కోణం! ఇండియా టార్గెట్‌గా.. డ్రాగన్‌ కంట్రీ డ్రామాలు!

Bangladesh, India, Sheikh Hasina, China: బంగ్లాదేశ్‌ అల్లర్లు వెనుక కుట్ర కోణం ఉందని.. అది ఇండియా టార్గెట్‌గానే జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరి రాజకీయ, ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

Bangladesh, India, Sheikh Hasina, China: బంగ్లాదేశ్‌ అల్లర్లు వెనుక కుట్ర కోణం ఉందని.. అది ఇండియా టార్గెట్‌గానే జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరి రాజకీయ, ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. ఇండియాకు వచ్చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. షేక్‌ హసీనా ప్రభుత్వం ప్రయత్నించడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు నిరసనలకు దిగారు. చిలికి చిలికి గాలి వానగా మారిన ఈ నిరసనలు ఏకంగా.. దేశ ప్రధాని రాజీనామా చేసి, దేశం విడిచిపారిపోయేలా చేశాయి. ఈ అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేక, ప్రభుత్వ మద్దతుగా రెండు వర్గాలుగా దేశం చీలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక వర్గానిదే ఈ అల్లర్లలో పైచేయిగా నిలిచింది. ఈ నిరసనలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన.. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ నాయకత్వం వహించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు.. అల్లర్లుగా మారి.. ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమంగా మారడం అంటే చిన్న విషయం కాదు. దీని వెనుక చాలా పెద్ద వ్యక్తులు, శక్తులు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ అల్లర్ల వెనుక డ్రాగన్‌ కంట్రీ చైనా హస్తం ఉందని.. ఇండియా టార్గెట్‌గానే బంగ్లాదేశ్‌ను బలిపశువును చూస్తూ.. చైనా మొత్తం నడిపిస్తోందని రాజకీయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అల్లర్లతో చైనాకు ఏంటి లాభం?
షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 2009 నుంచి బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 288 సీట్లు సాధించి.. ఏకపక్ష విజయం సాధించింది. అయితే.. షేక్‌ హసీనా భారత్‌కు అనుకూలంగా ఉంటారు. ఇండియా కూడా బంగ్లాదేశ్‌కు ఎంతో సాయం చేస్తోంది. ఆర్థికంగాను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌.. ఇండియా మిత్రదేశంగా ఉంది. ప్రతి విషయంలో మనతో పోటీ పడే చైనాకు ఇది అస్సలు గిట్టని అంశం. ఇప్పటికే పాకిస్థాన్‌, శ్రీలంకలో పెట్టుబడుల పేరుతో అక్కడి ఓడరేపులను అభివృద్ధి చేసి.. వాటిని తమ అధీనకంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బును కుమ్మరిస్తూ.. ఒక విధంగా బంగ్లాదేశ్‌ను అప్పుల ఊబిలో ఇరికించి తమ మాట వినేలా చేసుకునే కుట్ర చేస్తోంది. అయితే.. బంగ్లాదేశ్‌లో తము అనుకున్నది జరగాలంటే.. ఇండియాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కాకుండా.. తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉండాలనేది చైనా లక్ష్యం. అందుకే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లను తెర వెనుక నుంచి చైనా ప్రొత్సహిస్తోంది.

రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో.. ఇండియా పేరేందుకు?
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు, షేక్‌ హసీనా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని అనేక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే.. మరి ఈ నిరసనల్లో ‘ఇండియా ఔట్‌’ అనే నినాదం ఎందుకు చాలా ఎక్కువ వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం.. బీఎన్‌పీ సీనియర్‌ నేత జనరల్‌ రుహుల్‌ కమీర్‌ రిజ్వీ.. కశ్మీర్‌ కండువాలను తగలబెట్టి, ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారం చేశారు. ఆయన ఇచ్చిన పిలుపుకు కౌంటరిస్తూ.. మీ భార్యలు ధరించే ఇండియా చీరలను కూడా తగులబెట్టండి అని షేక్‌ హసీనా అన్నారు. దేశ అంతర్గత వ్యవహారం గురించి జరిగే నిరసనల్లో.. ఏ దేశం నుంచి అయితే ఎక్కువగా ఆర్థిక సాయం పొందుతున్నారో ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే అంత ధైర్యం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి ఎవరిచ్చి ఉంటారు? ఇంకెవరు చైనానే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇండియాకు వ్యతిరేకంగా బీఎన్‌పీ నాయకులు మొదలు పెట్టిన ‘ఇండియా ఔట్‌’ క్యాంపెయిన్‌ వెనుక చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ ఓడరేవును, శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టును అభివృద్ధి చేసిన చైనా.. వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంది. భారీ ఆర్థిక సాయం ఆశచూపి.. హంబన్‌తోట పోర్టును ఏకంగా 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది చైనా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని ప్యారా ఓడరేవును కూడా అభివృద్ధి చేస్తామంటూ ఒప్పందం కుదుర్చకుంది. ఇలా ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో పెటుబడుల పేరుతో ఆ దేశాల్లోన్ని ఓడరేవులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది చైనా. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, చిట్టగాంగ్‌ పోర్టులు మినహా.. ఆసియాలోని చాలా ఓడరేవులు చైనా ఆధీనంలోనే ఉన్నాయి. మన చుట్టూ ఉండే పోర్టులపై చైనా పెత్తనం భవిష్యత్తులో ఆర్థికంగా ఇండియాపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని భారత ఆర్థిక, రాజకీయ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments