Arjun Suravaram
Yatra-2 Movie Trailer: యంగ్ డైరెక్టర్ మహీ వి. రాఘవన్ తెరకెక్కించిన యాత్ర-2 మూవీ ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Yatra-2 Movie Trailer: యంగ్ డైరెక్టర్ మహీ వి. రాఘవన్ తెరకెక్కించిన యాత్ర-2 మూవీ ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Arjun Suravaram
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర-2 సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లీడర్ గా ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఏపీ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర-2 తెరకెక్కింది. తాజాగా శనివారం యాత్ర-2 ట్రైలర్ విడుదలైంది. మరి.. ఈ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖల జీవితాలపై పలు సినిమాలు వచ్చాయి. అయితే వాటంన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర మూవీకి దక్కింది. దివంగత నేత, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. యాత్రను మహీ వి.రాఘవన్ తెరకెక్కించారు. అందులోని పాటలు, ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇక యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర-2 సినిమా రాఘవ్ తెరకెక్కించారు. ఈ సినిమాను కూడా ఫిబ్రవరి 8న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యాత్ర-2 ట్రైలర్ వచ్చేసింది.
ఇక ట్రైలర్ చూస్తే.. ఓ పేద కుటుంబం తమ బిడ్డకు వచ్చిన సమస్య గురించి చెప్పుకునేందుకు వైఎస్సార్ దగ్గరి వస్తారు. ఆ పాప సమస్యను చూసిన వైఎస్సార్ చలించి పోతారు. ఇదే సమయంలో ఇలా ఒక్క పాపకే పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించడం సరికాదు సార్.. అంటూ పక్కన ఉన్న పీఏ చెబుతాడు. ‘నువ్వు చెప్పింది కరెక్టే.. కానీ.. మనం చేయలేము అనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు’ అంటూ వైఎస్సార్ చెప్పిన మాట.. మన హృదయాలను టచ్ చేస్తుంది. వైఎస్సార్ మరణించడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంట్రీ ఇస్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రం ఎలా కుట్రలు పన్నిందో ఇందులో చక్కగా చూపించారు. వారి కుట్రను చేధిస్తూ ప్రజలకు వద్దకు వెళ్లి.. వైఎస్ జగన్ ముందుకు సాగిన తీరు వేరే లెవెల్ లో చూపించారు.
“జగన్ కడపోడు సార్.. ఒక్కసారి శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక.. వాళ్లు నాశనం అయిపోతారని తెలిసినా కూడా శత్రువుకు తలవంచ్చడు సార్’ అనే డైలాగ్ అదిరిపోయింది. ఇక వైఎస్ జగన్ చేసిన పాదయాత్రకు ప్రజలు పట్టిన బ్రహ్మరథాన్ని డైరెక్టర్ చక్కగా చూపించారు. ‘ఎన్నికలు అయిపోయాక జనాలను మోసం చేసి.. నా విశ్వసనీయతని పోగొట్టుకోలేను అన్న. ఆ నమ్మకం లేని రోజు మా నాయన లేరు నేను లేను” అంటూ జగన్ చెప్పే డైలాగ్.. ఈ ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. చివర్లో ఓ అంధుడితో వైఎస్ జగన్ చెప్పిన ఓ డైలాగ్, ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందరిని ఎమోషనలయ్యేలా చేసింది. ‘నేను విన్నాను నేను ఉన్నాను’ అంటూ జగన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తంగా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.
వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను టచ్ చేశాయి. తాజాగా యాత్ర 2 నుంచి వచ్చిన ట్రైలర్‌కు అదే సీన్ రిపీట్ అయింది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి.. యాత్ర 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.