నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో నటించిన ఈ నటి ఎక్కడ? ఏం చేస్తోందంటే?

సిద్దార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటాానా. 2005లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో శ్రీహరి, త్రిష ఇంట్లో పనిమనిషిగా వర్క్ చేసిన ఈ నటి గుర్తుందా.. ఇప్పుడు తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదంటే...?

సిద్దార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటాానా. 2005లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో శ్రీహరి, త్రిష ఇంట్లో పనిమనిషిగా వర్క్ చేసిన ఈ నటి గుర్తుందా.. ఇప్పుడు తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదంటే...?

బాయ్స్ మూవీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు సిద్దార్థ్. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. 1989లో సల్మాన్, భ్యాగ్రశీ జోడీగా వచ్చిన మైనా ప్యార్ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) మూల కథను తీసుకుని, ఇక్కడ నెటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశాడు రైటర్ కమ్ డైరెక్టర్ వీరు పోట్ల. 2005లో సంక్రాంతి మూవీలో నిలిచిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు నిర్మించారు. సిద్దార్థకు మంచి ల్యాండింగ్ పిక్చర్ అయ్యింది. ఇందులో త్రిష పల్లెటూరి అమ్మాయిగా, అన్న చాటు చెల్లెలిగా నటించి మెప్పించింది. ప్రకాష్ రాజ్, శ్రీహరిలాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రాణం పోశారు. వీరే కాదు.. శ్రీహరి ఇంట్లో పని చేసే అమ్మాయిగా యాక్ట్ చేసిన నటి సైతం కామెడీ పండించింది. ఇప్పుడు  ఆ యాక్ట్రెస్ ఏం చేస్తుందంటే..? తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదంటే.?

జాగ్రత్త అనగానే చేతిలో ఏదీ ఉంటే అది పడేసి ఫన్ క్రియేట్ చేసే నటి పేరు సంతోషి శ్రీకర్.  నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా ఆమె నటనకుగానూ బెస్ట్ కమెడియన్‌గా నంది అవార్డును అందుకుంది. ఆ తర్వాత అడపా దడపా చిత్రాలు చేసి తెరకు దూరమైంది. ఢీ మూవీ తర్వాత తెలుగులో కనిపించని ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..? ప్రస్తుతం ఆమె ఎంటర్ ప్రెన్యూర్‌గా రాణిస్తుంది. ఆమె ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబు (మురారి మూవీలో మహేష్ బాబు పెద్దన్నయ్య, లక్ష్మీ భర్తగా నటించిన యాక్టర్) కోడలు. ఆయన కొడుకు శ్రీకర్‌ను వివాహం చేసుకున్న సంతోషి.. ప్లస్ బొటిక్ అండ్ బ్యూటీ లాంజ్ ఏర్పాటు చేసి బ్యూటీషియన్ కోర్సులు నిర్వహిస్తుంది. చెన్నై, రాజమండ్రి, హైదరబాద్ నగరాల్లో ఆమెకు ఈ బొటిక్స్ ఉన్నాయి. అంతేకాదు.. బయట కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉంటుంది.

తనలా బ్యూటీషియన్ కావాలనుకునే ఎంతో మంది యువతులు, మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చి నిష్ణాతుల్ని చేసింది. బ్రౌడల్ అండ్ పార్టీ మేకప్, శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్స్ వంటి వాటిల్లో శిక్షణనిస్తూ ఉంటుంది. ఈమె దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎంతో మంది మహిళలు.. ఇప్పుడు తనలాగే బిజినెస్ రంగంలోకి వచ్చేందుకు తోడ్పాటునందిస్తుంది. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే.. విజయవాడలో పుట్టినప్పటికీ..తల్లి పూర్ణిమ సీరియల్ నటి కావడంతో చెన్నైలో పెరిగింది. చదువులో డ్రాపర్ అయిన సంతోషి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2000లో పెంగల్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. హీరోయిన్, సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా నవదీప్ హీరోగా వచ్చిన జై. నవదీప్‌కు జోడీగా నటించింది ఈమెనే. ఒక్కడే, బంగారం, ఢీ చిత్రాల్లో కూడా నటించింది ఈమె వ్యాపార రంగంలో కొనసాగుతూనే.. అప్పుడప్పుడు టెలివిజన్ రంగంలో మెరుస్తుంది.

Show comments