Venkateswarlu
సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది. దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తోంది...
సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది. దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తోంది...
Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌లో తెరకెక్కుతున్న సలార్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశ్యాప్తంగా డిసెంబర్ 22న సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం సలార్ ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ తయారైంది. మొదటగా ఆ ట్రైలర్‌ను నిర్మాత విజయ్ కిరకందుగుర్‌కు వేసి చూపించారు.
ఆ ట్రైలర్ చూసిన విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. విజయం మనదే అన్నట్లు తన రెండు చేతుల్ని గాల్లోకి పైకి లేపి ఉంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే, చెప్పనక్కర్లేదు. ఎప్పుడెప్పుడూ అని యూట్యూబ్‌కు అతుక్కుని కూర్చున్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉండటం ఖాయం.. సినిమా నా భూతో నభవిష్యతి అన్నట్లుగా ఉండటం కూడా ఖాయం.
కాగా, సలార్‌లో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించారు. పృద్ధ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీరామ్ రెడ్డి, శ్రేయరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్, కాంతార సినిమాలను తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ దాదాపు వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో సలార్‌ను నిర్మించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ట్రైలర్ కూడా రికార్డులు సృష్టిస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరికొన్ని గంటల్లో రికార్డు మోత మోగిపోనుంది. కాగా, సలార్ సినిమాకు సంబంధించిన సూపర్ సీక్రెట్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. సలార్ సినిమాకు కేజీఎఫ్ సినిమాలకు ఎటువంటి సంబంధం ఉండదని తేల్చిచెప్పారు. సలార్ రెండు భాగాలుగా ఉంటుందని అన్నారు. దీంతో సంవత్సరానికి పైగా నడుస్తున్న ఓ ప్రచారానికి తెరపడినట్లు అయింది.
కాగా, ఈ రోజు ట్రైలర్ లాంఛ్ కోసం సినిమా టీం ఓ కార్యక్రమం నిర్వహించాలని అనుకుందట. అయితే, ఈరోజు యానిమల్ సినిమా విడుదల ఉండటంతో చిత్ర బృందం దాన్ని వాయిదా వేసుకుందట. ట్రైలర్‌ను సింపుల్‌గా రిలీజ్ చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని భావిస్తోందట. దేశ వ్యాప్తంగా పలు ముఖ్య పట్టణాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. మరి, సలార్ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించనుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.