ఆర్ధిక పరిస్థితులే నన్ను అణగద్రొక్కాయి: ఉత్తేజ్

నాగార్జున శివ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు నటుడు ఉత్తేజ్. తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన... పలు విషయాలను వెల్లడించారు.

నాగార్జున శివ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు నటుడు ఉత్తేజ్. తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన... పలు విషయాలను వెల్లడించారు.

1989లో వచ్చిన శివ సినిమాతో తెరకు పరిచయమైన ఉత్తేజ్ ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. ఎన్నో సినిమాలు, మరెన్నో మంచి పాత్రలు ఉత్తేజ్ ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. అతి చిన్న స్ఠాయి నుంచి కేవలం కష్టాన్ని నమ్ముకుని, అడుగడుగునా సుడిగుండాలే అయినా తట్టుకుని, వాటిని దాటుకుని ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ నటజీవితాన్ని పండించుకున్న అరుదైన నటుడు ఉత్తేజ్. నటుడిగానే కాదు, రంగస్థల ప్రయోక్తగా, రచయితగా, యాక్టింగ్ ట్రైనర్ గా కూడా ఉత్తేజ్ పరిశ్రమ ఒడిలో వేళ్ళూనుకున్నాడు. తనతో పాటు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన పూరీ జగన్నాథ్, క్రిష్ణవంశీ లాంటి వాళ్ళు దర్శకులుగా అగ్రశ్రేణిని అందుకున్నా ఉత్తేజ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటూ కొనసాగుతున్నాడు. దీని గురించే ఐ డ్రీమ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఎందుకు తను దర్శకుడికి కావాల్సిన అన్ని నైపుణ్యాలూ ఉన్నా కూడా దర్శకుడిగా ఎందుకు మారలేకపోయాడన్నదానికి వివరణ ఇచ్చాడు.

‘’ మాదంత సంపన్నమైన కుటుంబం కాదు. నేను రోజుకి పదిరూపాయలకి కూడా ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రూఫ్ రీడర్ గా పని చేస్తేగానీ నా జీవితం సాగలేదు. తర్వాత శివ తర్వాత నాకు మంచి గుర్తింపు నటుడిగా వచ్చింది. అవకాశాలూ వచ్చాయి. వాటి మీద ఆధారపడవలసి వచ్చింది. నేను డైరెక్షన్ డిపార్ట్ మెంటులో కూడా పనిచేసినా, దర్శకుడిగా అన్ని మెలకువలూ నేర్చుకున్నా కూడా దర్శకుడిని కావాలని ఏ రోజునా అనుకోవడానికి కూడా సాహసించలేదు. ఎందుకంటే డైరెక్షన్ అంటే ఓ రెండేళ్లు దానికే అంకితమైపోవాలి. మరో పని చేయడానికి లేదు. మరో అంశం మీదకి ఫోకస్ పెట్టడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. నేను సంపాదిస్తేగానీ ఇల్లు గడవడం కష్టం.

అదీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటేగానీ, ఇంటిల్లిపాదిని పోషించలేను. నెల తిరిగేసరికి ఖర్చులు, బాధ్యతలు అన్నీ చుట్టుముట్టేస్తాయి. వాటికి సమాథానం చెప్పవలసింది నేనొక్కడినే ఇంటి మొత్తానికి.అలాంటి పరిస్థితులలో నేను డైరెక్షన్ అని కూర్చుంటే జరిగే పనికాదు. అందుకే నేనస్సలు ఆ జోలికే పోవడం మాట అటుంచి, కనీసం అలోచించడానికి కూడా సాహసించలేదు. మరో ముఖ్య విషయం కూడా. క్రిష్ణ వంశీని, పూరీ జగన్నాథ్ లాంటి వాళ్ళని సెట్స్ మీద చూశాక మరీ భయమేసింది. వాళ్ళిద్దరే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్న ఆలోచనని అడ్డుకట్ట వేశారు. ఇదేదో వాళ్ళమీద నెగెటివ్ గా చెబుతున్న మాట కాదు. వాళ్ళ డెడికేషన్, కమిట్మెంట్ చూస్తే…..అమ్మో డైరెక్టర్ అంటే ఇంత గొడవ ఉందని భయమేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.

పూరీ పోకిరి ముందు దాదాపు స్క్రిప్టు రాసుకోవడానికి, సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్ళడానికి రెండేళ్ళ పాటు ఇంటికి దూరంగా ఉన్నాడు. రెండేళ్ళకి సరిపోయిన ఖర్చులకి కావాల్సిన డబ్బు ఇచ్చేసి పనిలో పడిపోయాడు. ఇలా నేను జన్మలో చేయలేను. వంశీ అయితే ఒక షాట్ తీయడానికి ఎంత ఆలోచిస్తాడో చూస్తే కళ్ళు తిరిగాయి నాకు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కాచిగూడ రైల్వే స్టేషన్లో సీను. నాగార్జున మీద షాట్ పెట్టడానికి కెమెరాని వందరకాలుగా తిప్పాడు. ఎందుకంటే నాగార్జున క్యారెక్టర్ ఆ సీన్లో చాలా వేవరింగ్ ఉంటుంది. ఆ వేవరింగ్ నంతా వంశీ తన షాట్లో చూపించాడు. ఇంత ఫోకస్ ఉంటేనే మరి. అలాగని నేను డైరెక్టర్ని కాలేదని నాకేనాడు వర్రీ లేదు. నా స్నేహితులు గొప్పదర్శకులయ్యారు. నాకు మంచిమంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అది చాలనుకున్నాను.’’ అని చెప్పాడు.

Show comments