చిన్న హీరోలే సినిమాలను బ్రతికిస్తున్నారు.. ఇదే నిదర్శనం

Tollywood Movies: ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు పూర్తిగా మారిపోయింది . ఈ మధ్య వచ్చిన సినిమాలతో అది స్పష్టంగా నిరూపించినట్లైంది. తాజాగా ఈ సినిమాల లిస్ట్ లోకి మరొక మూవీ కూడా యాడ్ అయింది. ఈ లెక్కన చూస్తే చిన్న సినిమాలే ఇండస్ట్రీని బ్రతికిస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి.

Tollywood Movies: ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు పూర్తిగా మారిపోయింది . ఈ మధ్య వచ్చిన సినిమాలతో అది స్పష్టంగా నిరూపించినట్లైంది. తాజాగా ఈ సినిమాల లిస్ట్ లోకి మరొక మూవీ కూడా యాడ్ అయింది. ఈ లెక్కన చూస్తే చిన్న సినిమాలే ఇండస్ట్రీని బ్రతికిస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి.

భారీ బడ్జెట్ , స్టార్ హీరోలు , హంగులు ఆర్భాటాలు ఉంటేనే సినిమా అనుకుంటే పొరబడినట్లే. కాలం మారింది. ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిపోయింది. ప్రతి సారి పెద్ద సినిమాలే ఇండస్ట్రీని ఆదుకోవడం అంటే అది అవ్వని పని. ఇలాంటి సమయంలోనే చిన్న సినిమాల విలువ ఇండస్ట్రీకి తెలుస్తుంది. వెళవెళ బోతున్న థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి చిన్న సినిమాలు. ఈ ఏడాది మొదటి నుంచి చూస్తున్నట్లైతే.. గుంటూరు కారం , కల్కి తప్ప భారీ బడ్జెట్ సినిమాలేమి లేవు. వీటితో పాటు మీడియం బడ్జెట్ సినిమాలలో సరిపోదా శనివారం ఆ స్టాండర్డ్స్ ను మైంటైన్ చేసింది. ఇక ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా చిన్న సినిమాలే. ఇప్పుడు ఈ చిన్న సినిమాల లిస్ట్ లోకి రీసెంట్ గా రిలీజ్ అయినా మత్తువదలరా మూవీ కూడా యాడ్ అవ్వడంతో.. చిన్న సినిమాలే ఇండస్ట్రీని బ్రతికిస్తున్నాయా అనే సందేహాలు మొదలయ్యాయి.

నిజమే ప్రేక్షకులు అనుకునే దానిలో తప్పులేదు. ఎందుకంటే ఆగష్టు 9 రిలీజ్ అయినా కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి.. రీసెంట్ గా రిలీజైన మత్తువదలరా-2 సినిమా వరకు వచ్చిన ప్రతి చిన్న సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పైగా ఈ సినిమాలకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం. కమిటీ కుర్రాళ్ళు తర్వాత ఆగష్టు 15న రిలీజ్ అయినా నితిన్ నార్నె ఆయ్ మూవీ. ఈ సినిమా అయితే ఏకంగా స్టార్ హీరోల మూవీస్ మధ్యలో రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ కొట్టేసింది. హీరోగా నితిన్ నార్నె రెండో సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఈ మూవీని హిట్ చేసేసారు. సస్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు.. ప్రస్తుతం ఓటీటీ లో కూడా అదరగొడుతున్నాయి. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ లో రిలీజ్ అయినా నివేద థామస్ 35 చిన్న కథ కాదు , సత్య మత్తువదలరా-2 సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంటున్నాయి. దీనిని బట్టి ప్రేక్షకులు చిన్న సినిమాలకు పెద్ద పీఠ వేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

ఎలాంటి అంచనాలు లేకుండా.. చిన్న బడ్జెట్ తో.. చిన్న హీరోలతో వచ్చిన సినిమాలు.. కాసుల వర్షం కురిపించడంతో.. డైరెక్టర్స్ కు చిన్న వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఇలా ప్రేక్షకులను మెప్పించేలా.. వారి కథలనే వారికి తెరపై చూపించే విధంగా చిత్రాలను రూపొందిస్తే మాత్రం.. కచ్చితంగా తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందని చెప్పి తీరాల్సిందే. కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ సినిమాలే వాటికి నిదర్శనం. ఇక ఇప్పుడైనా దర్శకులు సినిమాలను తీసే మారుతుందేమో చూడాలి. ఇకపై ఎలాంటి సినిమాలు వస్తాయో.. అవి ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాయో ముందు ముందు చూడాల్సి ఉంది. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments