తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన మహి.వి. రాఘవ్!

Mahi V Raghav: టాలీవుడ్ డైరెక్టర్ మహి వి. రాఘవ్ తెరకెక్కించిన యాత్ర-2 మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సీఎం వైఎస్ జగన్ పొటిలికల్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇది ఇలా ఉంటే ఓ ఇష్యూ విషయంలో ఈ మూవీ డైరకెర్టక్ సీరియస్ అయ్యారు.

Mahi V Raghav: టాలీవుడ్ డైరెక్టర్ మహి వి. రాఘవ్ తెరకెక్కించిన యాత్ర-2 మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సీఎం వైఎస్ జగన్ పొటిలికల్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇది ఇలా ఉంటే ఓ ఇష్యూ విషయంలో ఈ మూవీ డైరకెర్టక్ సీరియస్ అయ్యారు.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మహి.వి.రాఘవ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన డైరెక్షన్ తో ఇప్పటికే పలు విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు. 2019లో వచ్చిన యాత్ర కు సీక్వెల్ గా యాత్ర-2 ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 8న విడుదలైన యాత్ర-2నకు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవ్.. తనపై  వస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

యాత్ర-2 దర్శకుడు మహీ వి.రాఘవకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు జగన్‌ సర్కారు అడుగులు వేస్తుందని ఓ ప్రచారం జరిగింది. సుమారు రూ.20 కోట్ల విలువ చేసే రెండెకరాల స్థలాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధమైందని కొన్ని మీడియాలు ప్రచారం చేశాయి. ఇలా తనపై వస్తున్న విమర్శలకు, అలా ప్రచారం చేస్తున్నవారికి మహి.వి. రాఘవ్ స్ట్ర్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో మహి వి.రాఘవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే తనపై వస్తున్న విమర్శలపై గట్టిగానే సమాధానం. అలానే ఆయన మాట్లాడుతూ..రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని రాఘవ్ ప్రశ్నించారు. ఇక తన ప్రాంతం కోసమే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో రెండు ఎకరాల భూమిలోనే మిని స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు మహి తెలిపారు.

అంతేకాక కొందరిపై రాఘవ్ ఓ రేంజ్ లో పైర్ అయ్యారు. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని అన్నారు. ఓ వర్గం మీడియా ఈ విషయం గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని ఆయన విమర్శించారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చిన వారికి ఎక్కడెక్కడో భూములు ఇచ్చిందని, వాటి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే  తన ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలాని భావిస్తే.. దీనిపై మాత్రం పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని రాఘవ్ ఆగ్రహం మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..”నా ప్రాంతానికి ఏదో చేయాల‌నే ఆశయం లేక‌పోతే.. నేను హైద‌రాబాద్‌లోనో..వైజాగ్‌లోనో స్టూడియో క‌ట్టుకోవటానికి స్థ‌లం కావాల‌ని అడిగేవాణ్ని. వెనుక‌బ‌డిన ప్రాంతంగా చూసే మా మ‌ద‌న‌ప‌ల్లిలోనే ఎందుకు స్టూడియో కట్టాలనుకున్నాను. నేను రాయ‌ల‌సీమలో పుట్టి పెరిగా, ఇక్కడే చదువుకున్నా, అందుకే నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతో ఉన్నాను. నా ప్రాంతానికి ఏదో చేయాల‌నే ఉద్దేశమే తప్ప మరొకటి లేదు. మదనపల్లి, ఆ పరిసర ప్రాంతాల్లో సినిమాలు చేయ‌టం వ‌ల్ల స్థానిక హోటల్స్‌, లాడ్జీలు, భోజ‌నాలు జూనియ‌ర్స్‌కు ఉపయోగపడుతుంది భావించాను.

ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని రాయ‌ల‌సీమ‌ ప్రాంతంలో మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నా. బుద్ధి ఉన్నోడు ఎవ‌డైనా దీని గురించి ఆలోచించాలి. నా స్టూడియో నిర్మాణం కోసం 50, 100 ఎక‌రాలు అడ‌గ‌లేదు. కేవ‌లం రెండు ఎక‌రాలు మాత్రమే అడిగాను. ఇప్పటి వరకు ఎవరైనా రాయ‌ల‌సీమ‌కు ఏమైనా చేశారా! మీరు చేయ‌రు… చేసేవాడిని చెయ్య‌నియ్య‌రు. ఓ వర్గం మీడియా ఈ విషయం గురించి కనీసం కూడా ఆలోచించ‌లేదు. వాళ్ల‌ ఇష్టమైన ప్ర‌భుత్వం ఎవ‌రెవ‌రికీ భూముల‌ను ఇచ్చింది.  వీటి గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. కానీ మినీ స్టూడియో విషయంలో రెండు ఎకరాల్లో మినీ స్టూడియో క‌ట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు’ అని రాఘవ్‌ మండిపడ్డారు. మరి.. మహి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments