Somesekhar
ప్రొడ్యూసర్స్ కొన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న మూవీలను అక్టోబర్ 31లోగా ఫినిష్ చేయాలని డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రొడ్యూసర్స్ కొన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న మూవీలను అక్టోబర్ 31లోగా ఫినిష్ చేయాలని డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఒక సినిమాను తెరకెక్కించి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. 24 క్రాఫ్ట్ లను ఏకం చేసి మూవీని నిర్మించడం కత్తిమీదసాము లాంటిది. ఇక పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి నిర్మాతల మండలితో పాటుగా మరికొన్ని అసోసియేషన్స్ ఉంటాయన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా నిర్మాతల మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాలను అక్టోబర్ 31లోగా పూర్తి చేసుకోవాలని డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై నిర్మాతల మండలి తాజాగా సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఇక నుంచి స్టార్ హీరోలు నటించే ఏ సినిమా అయినా.. విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని నిర్ణయించింది. దాంతో పాటుగా ఆగస్ట్ 16వ తేదీ తర్వాత కొత్త సినిమాలు ఏవీ ప్రారంభించకూడదని సూచించింది. ప్రస్తుతం షూటింగ్స్ జరుపుకొంటున్న చిత్రాలు అక్టోబర్ 31లోపు చిత్రీకరణ పూర్తి చేసుకోవాలని డెడ్ లైన్ విధించింది. నవంబర్ 1 నుంచి ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఇక ఈ సమావేశంలో తమిళ నిర్మాతల మండలితో పాటుగా పలు అసోసియేషన్లు పాల్గొన్నాయి.