Sobhita Dhulipala: ఎంగేజ్‌మెంట్‌ తర్వాత శోభిత ఫస్ట్‌ పోస్ట్‌.. ఆ ఫొటోలు లీక్‌ చేసిందిగా

Sobhita1st Post After Engagement: నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత.. శోభిత ధూళిపాళ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Sobhita1st Post After Engagement: నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత.. శోభిత ధూళిపాళ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో శోభిత ధూళిపాళ-నాగ చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా రూమర్లు వచ్చినా.. ఇద్దరు వాటిపై పెద్దగా స్పందించలేదు. వీరు లవ్‌లో ఉన్నారా లేదా అని అభిమానులు డౌట్‌లో ఉండగానే.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ వార్తతో ఊహించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆగస్టు 8న నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ఇవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు ఈ ఇద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఎంగేజ్‌మెంట్‌ తర్వాత.. శోభిత ధూళిపాళ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో ఆమె కొన్ని ప్రైవేట్‌ ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ వివరాలు.

నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత.. ఈ అంశంపై స్పందిస్తూ.. చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. నాగ చైతన్యతో రిలేషన్‌ గురించి చెబుతూ.. వారిద్దరి ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శోభిత. మనిద్దరం ఎలా కలిశాము అన్నది ముఖ్యం కాదు.. పరిచయం ఎలా మొదలయినా.. ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ చెప్పుకొచ్చిన శోభిత.. నిశ్చితార్థం సందర్భంగా దిగిన కొన్ని క్యూట్‌ ఫొటోలను ఈ సందర్భంగా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీరు కూడా విడిపోతారని చెప్పుకొచ్చాడు. ఇక శోభిత విషయానికి వస్తే.. ఆమె తెలుగమ్మాయి. తెనాలీలో జన్మించింది. వైజాగ్‌లో పెరిగింది. ఇక 2013లో ఆమె ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో మెరిసింది. 2016లో బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ నటించిన గూఢచారి చిత్రంతో టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. అప్పటి నుంచి కోలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆమె యాక్ట్ చేసింది. ఇటీవలే మంకీ మ్యాన్ అనే చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక నాగ చైతన్య విషయానికొస్తే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించిన సమంతను 2017లో పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.2021లో సమంత-చై విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతి నుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య-శోభిత మధ్య డేటింగ్ పుకార్లు మాత్రం ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. పలు హాలీడే ట్రిప్‌లలో కూడా వీరు కలిసి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా వీటిని నిజం చేస్తూ.. నిశ్చితార్థం చేసుకున్నారు.

Show comments