ఎలాంటి హడావిడి లేకుండా ఓ యూట్యూబర్ ను పెళ్లి చేసుకున్నాడు స్టార్ సింగర్. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎలాంటి హడావిడి లేకుండా ఓ యూట్యూబర్ ను పెళ్లి చేసుకున్నాడు స్టార్ సింగర్. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఒక్కటౌతుంటే.. మరికొందరు సీక్రెట్ గా తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. కాగా.. ఇటీవలే బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరో నటుడు పద్మసూర్య కూడా నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి సిద్దంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఎలాంటి హడావిడి లేకుండా ఓ యూట్యూబర్ ను పెళ్లి చేసుకున్నాడు స్టార్ సింగర్. మరి ఆ స్టార్ సింగర్ ఎవరు? ఆ యూట్యూబర్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ సింగర్ హన్సరాజ్ రఘువంశీ.. 2019లో వచ్చిన ‘మేరా భోలా హై బండారీ’ అనే పాటతో సంచలనం సృష్టించాడు. అప్పట్లో ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ తర్వాత కూడా పలు దేవుడి సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘OMG 2’లో ‘ఉండి ఉండి వాడి’ పాటతో మరోసారి మెస్మరైజ్ చేశాడు. తాజాగా తన చిన్ననాటి స్నేహితురాలు, యూట్యూబర్ కోమల్ సక్లానీని పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా హిమాచల్ ప్రదేశ్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.
ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. హన్సరాజ్ పెళ్లి చేసుకున్న కోమల్ ఎవరో కాదు.. అతడి చిన్ననాటి స్నేహితురాలు. పైగా 2017 నుంచి వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు. కాగా.. ఈ జంట ఏడాది మార్చి చివర్లో నిశ్చితార్థం చేసుకొని.. తాజాగా పెళ్లితో ఒక్కటైయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సింగర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.