వయనాడ్ బాధితులకు సీనియర్ హీరోయిన్స్ భారీ విరాళం!

Kerala Cm Relief Fund For Wayanad People: ఇటీవల కేరళాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పర్యాటక కేంద్రమైన వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడి రాత్రికి రాత్రే పలు గ్రామాలు నేలమట్టం అయ్యాయి. వందల మంది మృత్యువాతపడ్డారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.

Kerala Cm Relief Fund For Wayanad People: ఇటీవల కేరళాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పర్యాటక కేంద్రమైన వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడి రాత్రికి రాత్రే పలు గ్రామాలు నేలమట్టం అయ్యాయి. వందల మంది మృత్యువాతపడ్డారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.

కేరళాలో ప్రకృతి విళయతాండవం చేసింది. వయనాడ్ జిల్లాలో వరద ప్రభావం వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 400లకు పైగా మృతి చెందార.. 170 మంది ఆచూకీ తెలియకుండా పోయింది.. వందల మంది గాయాలపాలై పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో ఎక్కడ చూసినా బురదమయం.. బాధితుల ఆర్తనాధాలే వినిపించాయి. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్లు సీఎం ని కలిసి తమవంతు విరాళం అందించారు. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ప్రకృతి విపత్తలు సంభవించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సినీ ప్రముఖులు తమ వంతు విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తుంటారు. కొంతమంది హీరోలు భారీ విరాళాలు ఇవ్వడమే కాదు.. తమ అభిమాన సంఘాలను వాలంటీర్లుగా రంగంలోకి దింపుతారు. వయనాడ్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు అక్కడి ప్రజలు. వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. చియాన్ విక్రమ్ ‘ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి’కి రూ.20 లక్షలు అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనుసు చేసుకొని రూ.2 కోట్ల విరాళం అందించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు ఇలా అనేక మంది స్టార్లు విరాళాలు అందజేశారు.

వాయనాడ్ విపత్తు బాధితుల కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్లు కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మాధ్యమంలో .. ‘చెన్నై నుంచి పలువురు హీరోయిన్లు వారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తరుపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపయాలు డబ్బు పోగుచేశాం.. కేరళ సీఎం పినరయి విజయన్ ని కలిసి చెక్కు అందజేశాం. ఇందుకు సహకరించిన సుహాసిని, కుష్బు, మీనా, శ్రీప్రియ, లిజి లక్ష్మి, కళ్యాణి ప్రియదర్శన్, శోభన అందరికీ అభినందనలు, వయనాడ్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ పోస్ట్ చేసింది.

Show comments