సప్త సాగరాలు దాటి (సైడ్ బి) సినిమా రివ్యూ!

  • Author venkateswarlu Published - 01:49 PM, Fri - 17 November 23

ప్రపంచానికి ప్రేమ కథలు కొత్తేమీ కాదు.. కానీ, కొత్తగా ఉన్న ప్రేమ కథల్నే ప్రపంచం గుర్తిస్తుంది. రెండు భాగాలు వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ సినిమా కూడా పాత కథతో కొత్త ఫీల్‌ను తెచ్చింది. రెండో భాగం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రపంచానికి ప్రేమ కథలు కొత్తేమీ కాదు.. కానీ, కొత్తగా ఉన్న ప్రేమ కథల్నే ప్రపంచం గుర్తిస్తుంది. రెండు భాగాలు వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ సినిమా కూడా పాత కథతో కొత్త ఫీల్‌ను తెచ్చింది. రెండో భాగం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  • Author venkateswarlu Published - 01:49 PM, Fri - 17 November 23

సప్త సాగరాలు దాటి (సైడ్ బి)

20231117, లవ్‌ ట్రాజెడీ డ్రామా, 2 hours 28 m యూ
యూ
  • నటినటులు:రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె అచార్, అచ్యుత్ తదితరులు
  • దర్శకత్వం:హేమంత్ ఎం రావు
  • నిర్మాత:రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్!
  • సంగీతం:చరణ్ రాజ్
  • సినిమాటోగ్రఫీ:అద్వైత గురుమూర్తి

Rating

3

ప్రేమ కథలకు.. ముఖ్యంగా విషాధ ప్రేమ కథలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది. కథలో కొత్తదనం లేకపోయినా.. కనెక్టింగ్‌ పాయింట్‌ ఉంటే చాలు. సినిమా సూపర్‌ హిట్‌ అవ్వటం ఖాయం. ప్రయోగాలకు మారుపేరుగా నిలిచే కన్నడ స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి ‘ సప్త సాగరాలు దాటి’ అనే లవ్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ లవ్‌ స్టోరీ రెండు భాగాలుగా తెరకెక్కింది. సైడ్‌ ఏ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల మందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో సప్తసాగరాలు దాటి సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రేక్షకులనుంచే కాదు.. విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ‘సప్త సాగరాలు దాటి’ సినిమా టీం సైడ్‌ బీని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. నవంబర్‌ 17న సైడ్‌ బీ థియేటర్లలోకి వచ్చింది. మరి, సైడ్‌ బీ ఎలా ఉంది? సైడ్‌ ఏ లాగే సైడ్‌ బీ కూడా ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?

కథ:

మను( రక్షిత్‌ శెట్టి), ప్రియ( రుక్మిణీ వాసంత్‌) ప్రేమికులు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ప్రియ ఎప్పటికైనా మంచి సింగర్‌ కావాలని కలలు కంటూ ఉంటుంది. ఆమెకు చిన్నప్పటినుంచి సముద్రం అంటే చాలా ఇష్టం. సముద్రం దగ్గర ఇళ్లు కట్టుకుని జీవించాలని ఆశ. ఇదే విషయాన్ని తరచుగా మనుకు చెబుతూ ఉంటుంది. ప్రియ చిరకాల కోరికను తీర్చడానికి మను ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు చేసిన యాక్సిడెంట్‌ను డబ్బు కోసం తన మీద వేసుకుంటాడు. చెయ్యని యాక్సిడెంట్‌ కేసులో జైలుకు వెళతాడు. అయితే, ఆ వ్యాపారవేత్త అతడ్ని విడిపిస్తాడని అనుకుంటాడు. అనుకోని విధంగా ఆ వ్యాపారవేత్త చనిపోతాడు. మను జైలులోనే ఇరుక్కుపోతాడు. మను జైలులో ఇరుక్కుపోవటానికి బయట ఉన్న ఓ వ్యక్తి కారణం అవుతాడు. మను జైలులో ఉండగానే ప్రియ పెళ్లి అయిపోతుంది. జైల్లో కూడా శత్రువులు తయారు అవుతారు. దీంతో మొదటి భాగం ముగుస్తుంది. సైడ్‌ బీలో తర్వాతి స్టోరీ మొదలవుతుంది.

సైడ్‌ బీ :

మను జైలు నుంచి బయటకు వస్తాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి దూరం అయ్యిందన్న బాధ ఓ వైపు. తనను మోసం చేసిన వారి మీద పగ తీర్చుకోవాలన్న కసి ఓ వైపు. రెండిటి మధ్యా మను ప్రతీక్షణం నలిగిపోతూ నరకం అనుభవిస్తూ ఉంటాడు. ప్రియ జ్ఞాపకాలతో ప్రతి నిత్యం ఛస్తూ బతుకుతుంటాడు. అలాంటి అతడి జీవితంలోకి వేశ్య సురభి (చైత్ర జె అచార్) వస్తుంది. ఆమె రాకతో మను జీవితం ఎలా మారింది? ప్రియతో మను భవిష్యత్తు ఏమతుంది? మను తన జీవితాన్ని నాశనం చేసి వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ :

సైడ్‌ ఏ మొత్తం ప్రేమ.. విరహంతో సాగితే.. సైడ్‌ బీ మొత్తం విరహం.. పగతో సాగుతుంది. తన స్టోరీని ఒక్క భాగంతో చెప్పలేనని డిసైడ్‌ అయిన హేమంత్ ఎం రావు రెండు భాగాలు తన కథను ప్రేక్షకుల ముందుకు తెచ్చి మంచి పని చేశాడు. సైడ్‌ ఏ కొంతమందికి సాధారణంగా అనిపించింది. అలాంటి సినిమాలు, కథలు చాలా వచ్చాయి కదా అన్నారు. కానీ, సైడ్‌ బీ మాత్రం అలా అనిపించదు. ప్రేమ కథలో కొత్తదనాన్ని ఆశించటం కంటే.. కథను ఫీల్‌ అయితే ఇట్టే కనెక్ట్‌ అవుతుంది. ముగ్గురి జీవితాలను ఓ చోటుకు తీసుకురావటంలో.. మనుషులు, మనసుల మధ్య జరిగే సంఘర్షణలతో కథను నడిపించటంలో దర్శకుడు సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. విషాథ కథకు ఎమోషన్స్‌ ముఖ్యం.. కీలక పాత్రధారుల నుంచి ఎమోషన్స్‌ను రాబట్టడంలో కూడా హేమంత్‌ బెస్ట్‌ అనిపించుకున్నారు.

నటీనటుల నటన :

బ్రేకప్‌ లవ్‌ స్టోరీల్లో భగ్న ప్రేమికుడిగా నటించటం.. మెప్పించటం రక్షిత్‌ శెట్టికి కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సినిమాల్లో భగ్న ప్రేమికుడిగా కనిపించారు. అయితే, ఈ సినిమాలో మాత్రం ఇంతకు ముందుకు చూడని రక్షిత్‌ శెట్టి కనిపిస్తారు. ప్రేమలో విఫలమైన ఎంతో మంది తమను తాము రక్షిత్‌ శెట్టిలో చూసుకుంటారు అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సైడ్‌ ఏతో పోల్చుకుంటే సైడ్‌ బీలో రక్షిత్‌ శెట్టి బాధగా కనిపించే సన్ని వేశాలు చాలా ఉంటాయి. ప్రతీ సన్ని వేశంలోనూ రక్షిత్‌ శెట్టిని చూస్తే కన్నీళ్లు రాకమానవు. ఇక, మెయిన్‌ లేడీ లీడ్‌ రుక్మిణీ వసంత్‌ పాత్ర పరిధి సైడ్‌ బీలో తక్కువ ఉన్నప్పటికి.. ఉన్నంత సేపు తన నటనతో ప్రేక్షకుల చూపు పక్కకు పోకుండా చూసుకుంటుంది. రక్షిత్‌-రుక్మిణ కలిసి ఉండే కొన్ని సన్ని వేశాల్లో ఇద్దరూ ది బెస్ట్‌ ఇచ్చారు. సెకండ్‌ లేడీ లీడ్‌ చైత్ర జె అచార్ కూడా అద్భుతంగా నటించింది. రక్షిత్‌-రుక్మిణి- చైత్ర ముగ్గురూ నటించారు అనటం కంటే జీవించారు అనటం బాగుంటుంది.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా రిలీజ్‌ కాకముందే పాటలు రిలీజ్‌ అయ్యాయి. పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సంగీత దర్శకుడు చరణ్ రాజ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సైడ్‌ ఏలో మ్యూజిక్‌కు సైడ్‌ బీలో మ్యూజిక్‌కు చాలా తేడా ఉంటుంది. సన్ని వేశానికి సన్ని వేశానికి మధ్య ఉన్న వేరియేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చరణ్‌ రాజ్‌ మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. సినిమాటోగ్రాఫర్‌ అద్వైత గురుమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని సీన్లు రియాలిటీకి ఏ మాత్రం తీసిపోకుండా తన కెమెరా పని తనాన్ని చూపించాడు. ఇక, ఎడిటర్‌ కూడా షాట్లు దెబ్బతినకుండా .. ఫీల్‌ పోకుండా అద్భుతంగా ఎడిటింగ్‌ చేశారు.

ప్లస్‌లు :

  • నటీనటుల నటన
  • సంగీతం.. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌
  • స్క్రీన్‌ ప్లే

చివరి మాట: సప్త సాగరాలు దాటైనా సరే సినిమా చూడొచ్చు..

రేటింగ్‌ : 3/5
(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments