Venkateswarlu
సమంత చేసిన సాయం గురించి ఓ లేడీ ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆమెకు ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఆ పోస్టును సమంత తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టింది.
సమంత చేసిన సాయం గురించి ఓ లేడీ ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆమెకు ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఆ పోస్టును సమంత తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టింది.
Venkateswarlu
సమంత ఇంకా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నారు. కొత్త సినిమాలకు సైన్ చేసినట్లు లేరు. చెన్నై స్టోరీ అనే మూవీకి ఆమె ఇది వరకే సైన్ చేసి ఉన్నారు. ఆ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం అయినట్లు కనిపించటం లేదు. సినిమా షూటింగులు లేకపోయినా.. సమంత మాత్రం యాడ్ షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఇక, ఫ్యాన్స్ కోసం మునుపటి కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు అక్కడ షేర్ చేస్తూ ఉన్నారు.
తాజాగా, సమంత సాయం కారణంగా కూతురి ప్రాణం నిలుపుకున్న ఓ మహిళ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సమంతకు ఓ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్‌లో ఆ మహిళ.. ‘‘నమస్కారం మేడమ్.. మీది చాలా అంటే చాలా గొప్ప మనసు. నా పాప గురించి ఆలోచించి.. మా పరిస్థితి అర్థం చేసుకుని ..నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ లాంటి గొప్ప మనసు ఉన్న వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే.. నా పాప మళ్లీ తిరిగి లైఫ్ లోకి వచ్చింది.
మీరు ఇలానే ఎన్నో మంచి పనులు చేయాలని, మా లాంటి పేద వాళ్ల జీవితాల్లో ఆనందం నింపాలని, వందేళ్లు చల్లగాంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడమ్. ఈ జన్మకు మీకు ఎంతో రుణ పడి ఉంటామ్ మేడమ్’’ అని పేర్కొంది. ఈ మెసేజ్ తాలూకా స్క్రీన్ షాట్‌ను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టారు. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. సమంత మంచితనాన్ని కొనియాడుతున్నారు.
కాగా, సమంత గత కొన్నేళ్లుగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ కూతురికి కూడా సాయం చేశారు. సమంత సాయం కారణంగా చిన్నారి ప్రాణం నిలబడింది. తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, సమంత మైయోసైటిస్నుంచి 90 శాతం కోలుకున్నారు. ఇప్పుడిప్పుడే నచ్చిన ఆహారం తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికి వ్యాయామం విషయంలో రాజీ పడటంలేదు. మరి, సమంత చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.