‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!

  • Author singhj Published - 08:04 PM, Thu - 21 September 23
  • Author singhj Published - 08:04 PM, Thu - 21 September 23
‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ ఒకటి. డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ అందరూ ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్​తో సౌత్​తో పాటు నార్త్​ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం ‘సలార్​’కు ఇంతగా హైప్ రావడానికి ఒక కారణం. ‘బాహుబలి’ సిరీస్​తో పాటు ఆ తర్వాత వచ్చిన పలు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్​లో అభిమానగణాన్ని పెంచుకున్న ప్రభాస్ నటిస్తుండటం ‘సలార్’పై అంచనాలు మరింత పెరగడానికి రెండో కారణంగా చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాది ఆడియెన్స్​ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ పుల్ మాస్ అవతార్​లో కనిపిస్తుండటం.. యాక్షన్​, బిల్డప్ సీన్లతో టీజర్ నిండిపోవడంతో ‘సలార్’పై ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్​ను మేకర్స్ ముందే లాక్ చేశారు. అనుకున్న ప్రకారం అయితే సెప్టెంబర్ 29న ప్రభాస్ మూవీ థియేటర్లలోకి రావాల్సింది. కానీ నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్​ను పోస్ట్​పోన్ చేశారు. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో సరికొత్త రిలీజ్ డేట్​ను ప్రకటిస్తారని అలాగే ట్రైలర్​ను కూడా విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘సలార్’ రిలీజ్ గురించి మరో బజ్ వినిపిస్తోంది.

‘సలార్’ ఈ ఏడాది విడుదల కావడం లేదట. ఈ మేరకు వాయిదా గురించి ఇప్పటికే మూవీతో బిజినెస్​లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు సమాచారం ఇచ్చారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘సలార్’ బిగ్ స్క్రీన్లలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఒకవేళ సంక్రాంతి గనుక మిస్సయితే ఇక సమ్మర్​లోనే సినిమాను ఆడియెన్స్​ ముందుకు తీసుకొస్తారని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ‘సలార్​’ను మరింత క్వాలిటీతో దేనికీ కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ అహర్నిషలు శ్రమిస్తోందని సమాచారం. దీంతో ‘సలార్’ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఇక మర్చిపోవాల్సిందేనని నెటిజన్స్ అంటున్నారు. సంక్రాంతి లేదా సమ్మర్ వరకు వెయిటింగ్ తప్పదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: 7/జీ రీ రిలీజ్.. 20 ఏళ్ల తర్వాతా ఇంత క్రేజ్​కు కారణం?

Show comments