వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరోసారి ఏపీ ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ‘వ్యూహం’ అనే సినిమా సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎలక్షన్స్ సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ చేసి రచ్చ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఎలక్షన్స్ సమీపిస్తుండటంతో.. వ్యూహం సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు ఆర్జీవి. ఏపీ పాలిటిక్స్ పై జగన్ కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో.. ఆర్జీవి వ్యూహం సినిమా తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. జగన్ సంబంధించి వ్యూహం, శపథం అని రెండు సినిమాలు తీయనున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేసిన వర్మ.. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ తో సర్ప్రైజ్ చేశాడు.
ఇప్పుడు కొత్తగా తీసిన వ్యూహం మూవీని.. నవంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ట్రైలర్ లో మెన్షన్ చేశాడు. ఇక శపథం సినిమాని వచ్చే ఏడాది.. 2024 జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. వ్యూహం ట్రైలర్ లో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పై జరిగిన కుట్రలు, ఆరోపణలు.. 2009 నుండి 2014 వరకు జగన్ లైఫ్ లో ఏం జరిగింది? అనేది నేపథ్యంలో వర్మ.. సినిమా ప్లాన్ చేశాడు. జగన్ సీఎం అయ్యేముందు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జగన్ సీఎం అయ్యాక ఏం చేశారు? అనే పాయింట్స్ టచ్ చేస్తూ వర్మ.. వ్యూహం సినిమాని చాలా ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు.
అంతేగాక ట్రైలర్ లో.. జగన్ తో పాటు జగన్ ఫ్యామిలీ.. అంటే ఆయన భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యుల పాత్రలు కూడా ప్రెజెంట్ చేశాడు వర్మ. టీడీపీ లీడర్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ.. ఇలా చాలా క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచేసాడు. జగన్ క్యారెక్టర్ లో.. నటుడు అజ్మల్ మరోసారి ఒదిగిపోయాడు. గతంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కూడా జగన్ క్యారెక్టర్ ని అజ్మల్ పోషించిన విషయం విదితమే. ట్రైలర్ లో సప్రైజింగ్ విషయం ఏంటంటే.. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కూడా ఇందులో మెన్షన్ చేయడం. ప్రస్తుతం వ్యూహం ట్రైలర్ సినిమా పై ఆసక్తి రేపుతూ వైరల్ అవుతోంది. ఈ సినిమా రాజకీయం పరంగా ఏపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి వ్యూహం ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.