శంకర్ దాదా MBBSలో చిరు రూమ్మేట్ గుర్తున్నాడా? ఇప్పుడు ఒక రేంజ్‌లో!

మెగాస్టార్ కామెడీ పండించిన సినిమాల్లో ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్. చిరంజీవి ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్. ఆ సినిమా పాటలు కానీ, మాటలు కానీ ఇప్పటికీ అలా గుర్తిండిపోతాయి. ఇందులో చిరంజీవితో కలిసి..

మెగాస్టార్ కామెడీ పండించిన సినిమాల్లో ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్. చిరంజీవి ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్. ఆ సినిమా పాటలు కానీ, మాటలు కానీ ఇప్పటికీ అలా గుర్తిండిపోతాయి. ఇందులో చిరంజీవితో కలిసి..

మెగాస్టార్ చిరంజీవిలో కామెడీ యాంగిల్ చూపించిన మూవీ చంటబ్బాయి. ఆ తర్వాత మళ్లీ ఆయన సీరియస్ క్యారెక్టర్లే చేశారు. చాలా ఏళ్ల తర్వాత మరోసారి తనలోని హాస్యాన్ని రుచి చూపించిన చిత్రం  శంకర్ దాదా ఎంబీబీఎస్‌. ఈ చిత్రంలో పరేష్ రావల్‌ను ఓ ఆట ఆడేసుకుంటారు మన చిరు. కాలేజీలో చేరిన నాటి నుండి సినిమా ఆద్యంతం నవ్వులు పువ్వులు పూయిస్తుంది. బాలీవుడ్ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. సోనాలి, శ్రీకాంత్, గిరీష్ కర్నాడ్ ముఖ్య పాత్ర పోషించారు. 2004లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీలో మన శర్వానంద్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్న సంగతి విదితమే. అయితే ఈ చిత్రంలో తన అమాయమైన నటనతో కట్టిపడేసిన స్వామి గుర్తున్నాడా? అతడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గుర్తున్నాడా..? శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో చిరంజీవి బెంచ్, రూమ్మేట్‌గా నటించాడు. కాలేజీలో తెరకెక్కించిన సీన్లలో దాదాపు అన్నింటిలో మెగాస్టార్ పక్కన కనిపిస్తూనే ఉంటాడు. ఆ సినిమాలో రూంలో మన చిరు సార్ చేరటానికి వస్తే.. వాళ్ల గ్యాంగ్ హంగామా సృష్టిస్తుంది. ఆ గదిలోనే ఉంటాడు ఇతడు. అతడి పేరు ఏంటనీ చిరు అడిగితే ‘ చిలుకూరి వీర వెంటక సుబ్రమణ్య స్వామి’ అని అనగా.. స్వామి అని పిలుస్తాలే అంటారు. ఆ స్వామి క్యారెక్టర్ వేసిన కుర్రాడు ఎవరో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నారో తెలుసా..? ఆయనో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఫోట్రియా ఫోటోగ్రఫీ పేరుతో ఓ ఆర్గనైజ్ రన్ చేస్తున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో రూల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన అసలు పేరు వెంకట రమణ మల్లోజుల అని తెలుస్తోంది. వెంకీ అకాడమీ పేరుతో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండీ.

సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ ఫోటో షూట్స్, క్లాసెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు వెంకీ. అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ.. తన ఉద్యోగులను మెస్మరైజ్ కూడా చేస్తుంటారు. ఆయనలో కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందండోయ్. ఆయన క్లాసెస్ వింటుంటే అర్థమౌతుంది. 20 ఏళ్ల తర్వాత ఆ వీడియోల్లో ఆయన్ను చూస్తే.. స్వామియేనా అని ఆశ్చర్యపోవడం ఖాయం. అయితే ఫోటోగ్రఫీ మీద ఫ్యాషన్ తో ఈ రంగంలోనే స్థిరపడినట్లు తెలుస్తోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఆయన మరో ఏ సినిమాలో కనిపించినట్లు సమాచారం లేదు. మరోసారి తెరపై ఎందుకు కనిపించలేదో, అవకాశాలు రాలేదో తెలియాల్సి ఉంటుంది. మొత్తానికి మన స్వామి చాలా ఫేమస్. ఆ క్యారెక్టర్ అనగానే మీకేమీ సీన్ గుర్తుకు వస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments