Venkateswarlu
రష్మిక ఫేక్ వీడియోపై బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ స్పందించారు. ఆ వీడియో క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అయ్యారు. అలాంటి చెత్త వీడియోలు చేసే వారిపై లీగల్..
రష్మిక ఫేక్ వీడియోపై బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ స్పందించారు. ఆ వీడియో క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అయ్యారు. అలాంటి చెత్త వీడియోలు చేసే వారిపై లీగల్..
Venkateswarlu
రష్మిక ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియోపై సోషల్ మీడియా వ్యాప్తంగా కామెంట్లు, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. కొంతమంది అది నిజంగా రష్మిక వీడియో అనుకుంటున్నారు. ఇక ఆ వీడియో ఫేక్ దని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అచ్చం రష్మిక మందన్నలా ఉన్న ఓ యువతి లిఫ్ట్‌లోకి వస్తుంది. లోపల ఉన్న వాళ్లను చూసి నవ్వుతుంది. ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని ఇట్టే అర్థం అయిపోతుంది.
రష్మిక ఫేక్ వీడియోపై బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ స్పందించారు. ఆ వీడియో క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అయ్యారు. అలాంటి చెత్త వీడియోలు చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు. అభిషేక్ అనే ఓ ట్విటర్ ఖాతాధారుడు రష్మిక ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు. ఆ ట్వీట్‌లో ఆమె ఎవరో చెప్పుకొచ్చాడు. ‘‘ ఈ వీడియోలో ఉన్న ఆమె పేరు జారా పాటెల్. బ్రిటీష్-ఇండియన్ యువతి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఆమె ఈ వీడియోను అక్టోబర్ 9వ తేదీన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు’’ అని పేర్కొన్నాడు. కాగా, రష్మిక తాజా చిత్రం యానిమల్ విడుదల సిద్ధంగా ఉంది. డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇక, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రష్మిక ఫేక్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
— Abhishek (@AbhishekSay) November 5, 2023