బంపర్ ఆఫర్.. సినిమా చూడండి.. వెండి నాణేలు గెలుచుకోండి!

Get A Chance To Win Silver Coins By Watching Operation Raavan Movie And Answer The Question: సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించేందుకు మూవీ మేకర్స్ పలు స్ట్రాటజీలను ప్లే చేస్తున్నారు. వినూత్న ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆపరేషన్ రావణ్ మూవీ టీమ్ ప్రేక్షకులకు వెండి నాణాలు గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది.

Get A Chance To Win Silver Coins By Watching Operation Raavan Movie And Answer The Question: సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించేందుకు మూవీ మేకర్స్ పలు స్ట్రాటజీలను ప్లే చేస్తున్నారు. వినూత్న ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆపరేషన్ రావణ్ మూవీ టీమ్ ప్రేక్షకులకు వెండి నాణాలు గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది.

ఓటీటీలు వచ్చాక సినిమా థియేటర్స్ కి వచ్చే జనాలు తగ్గిపోయారు. సినిమా బాగుందని టాక్ వస్తే అప్పుడు జనాలు థియేటర్స్ కి వెళ్తున్నారు. ఈ గ్యాప్ లో సినిమాలకి టికెట్లు తెగకపోతే నష్టం కనుక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మూవీ మేకర్స్ పలు ఆఫర్స్ ని తీసుకొస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రాటజీని వాడుతున్నారు. ఇప్పటికే ‘పేకమేడలు’ మూవీ టీమ్ పలు ఆఫర్స్ ని తీసుకొచ్చింది. 50 రూపాయలకే టికెట్స్ ని విక్రయించిన పేకమేడలు మూవీ టీమ్.. తాజాగా మరో ఆఫర్ ని తీసుకొచ్చింది. ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. బుక్ మై షోలో ఈ ఆఫర్ వరిస్తుందని తెలిపింది. ఈ మూవీ బాటలోనే మరో మూవీ కూడా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

పలాస సినిమా ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘ఆపరేషన్ రావణ్’ మూవీ జూలై 26న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ వినూత్న ఆఫర్ ని ప్రకటించారు. సినిమా చూసి ఫస్ట్ హాఫ్ లోగా విలన్ ఎవరో కనిపెట్టిన వారు వెండి నాణేలు గెలుచుకోవచ్చునని ప్రకటించారు. ఈ సందర్భంగా.. రక్షిత్ అట్లూరి ఒక వీడియోను విడుదల చేశారు. ‘డబ్బులెవరికీ ఊరికే రావు. కానీ మా ఆపరేషన్ రావణ్ సినిమా చూస్తే సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం ఉంది. ఆపరేషన్ రావణ్ సినిమా ఉదయం షోకి వెళ్లి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మేము కింద ఇచ్చే నంబర్ కి విలన్ ఎవరో గెస్ చేస్తే.. అదేనండి ఆ మాస్క్ వెనకాల ఉన్న సైకో విలన్ ఎవరో గెస్ చేయగలిగితే ప్రతీ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. ఆపరేషన్ రావణ్ సినిమా జూలై 26న రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళండి. ఈ సినిమా చూడండి. సిల్వర్ కాయిన్ గెలుచుకోండి. థాంక్యూ’ అంటూ రక్షిత్ అట్లూరి ఒక వీడియోను విడుదల చేశారు.

మరింకనే మీరు జీనియస్ పీపుల్ అయితే.. మీరు సిల్వర్ కాయిన్ ని గెలుచుకోవచ్చు. గెలిచిన వెయ్యి మందికి ఈ సిల్వర్ కాయిన్స్ బహుమతిగా ఇస్తామని టీమ్ ప్రకటించింది. 9573812831 వాట్సాప్ నంబర్ కి ఫోటో, టికెట్, సైకో విలన్ ఎవరు? అనేది గెస్ చేసి కరెక్ట్ సమాధానాన్ని పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. విజయవాడ, వైజాగ్ వంటి సిటీల్లో తన చేతుల మీదుగా ఈ వెండి నాణాలను అందజేస్తానని.. వెయ్యి సిల్వర్ కాయిన్స్ ని చేయించి ఉంచామని రక్షిత్ అట్లూరి అన్నారు. ఇక ఈ సినిమాకి రక్షిత్ తండ్రి వెంకట్ సత్య దర్శకత్వం వహించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాతగా వ్యవహరించారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 26న రిలీజ్ కాబోతుంది.       

Show comments