Venkateswarlu
ప్రేక్షకుల్ని థియేటర్ల వరకు రప్పించడానికి సినిమా టీంలు కొత్త కొత్త పద్దతుల్ని ఫాలో అవుతున్నాయి. సినిమాకు ఒకరకంగా ప్రమోషన్ కల్పించుకుంటున్నాయి.
ప్రేక్షకుల్ని థియేటర్ల వరకు రప్పించడానికి సినిమా టీంలు కొత్త కొత్త పద్దతుల్ని ఫాలో అవుతున్నాయి. సినిమాకు ఒకరకంగా ప్రమోషన్ కల్పించుకుంటున్నాయి.
Venkateswarlu
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. టీవీలు, ఓటీటీలు వచ్చిన తర్వాత జనం సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూడ్డం బాగా తగ్గించేశారు. వ్యవ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని ఇంట్లోనే సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డారు. ఇది ఒకరకంగా సినిమా రంగాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పడేసింది. థియేటర్‌లలో రిలీజ్ అవుతున్న సినిమాలు నష్టాలు చవి చూస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలైతేనే జనం హాళ్లకు వెళుతున్నారు.
చిన్న సినిమాలను అస్సలు పట్టించుకోవటం లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్ వరకు వెళ్లి చిన్న సినిమాలను చూడ్డానికి ఇష్టపడ్డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనాన్ని సినిమా థియేటర్ల వరకు రప్పించడానికి సినిమా నిర్మాతలు, టీం కొత్త కొత్త పద్దుతుల్ని, మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ను ఫాలో అవుతున్నారు. సినిమా లవర్స్‌కు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే .. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలా సినిమా టీం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
కీడా కోలా సినిమాను మల్టీప్లెక్స్ ల్లో కేవలం రూ. 112కే చూసే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా మల్టిఫ్లెక్స్ అంటే టికెట్ ధర మినిమం 200 పైనే ఉంటుంది. కీడా కోలా ఇచ్చిన ఆఫర్‌తో దాదాపు 80 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ ఆఫర్ బుధవారం నుంచి శుక్రవారం వరకే అందుబాటులో ఉంటుంది. ఇక, ‘నరకాసుర’ సినిమా టీం కూడా ఇలాంటి ఆఫర్‌నే ప్రేక్షకుల కోసం తీసుకువచ్చింది. తమ సినిమాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలన్న ఉద్ధేశ్యంతో టికెట్ పై ఓ ఆఫర్ ప్రకటించింది.
ఒకే టికెట్‌పై ఇద్దరు సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. గురువారం వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జంటగా సినిమా చూడాలనుకునే వారు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎంచక్కా ఒకే టికెట్‌పై ఇద్దరు సినిమా చూడొచ్చు. కాగా, నరకాసుర సినిమా దర్శకుడు సెబాస్టియన్ నోవా అకోస్టా తన జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాజర్, సంగీర్ధన, చరణ్ రాజ్, ఎస్.ఎస్. కాంచి , శ్రీమాన్, ఫిష్ వెంకట్ , తేజ్ చరణ్ రాజ్ తదితరలు నటించారు.
ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా ఓ రోజు దర్శకుడు సెబాస్టియన్ రైలు ప్రమాదానికి గురయ్యారు. అతడి కుడి చెయ్యి తెగిపోయింది. అయినా కూడా ఆయన సినిమాను వదల్లేదు. కేవలం 27 రోజులు మాత్రమే ఆస్పత్రిలో ఉన్నారు. తర్వాత వెంటనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఒంటి చేత్తోనే దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌తో దూసుకుపోతోంది. మరి, నరకాసుర టీం ప్రకటించిన బంపర్ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.