లాక్ డౌన్ టైమ్ లో ఓటిటి రిలీజై సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సినిమా ‘మా ఊరి పొలిమేర’. ఆహా ఓటిటిలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని పర్ఫెక్ట్ ఎండింగ్ తో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. చేతబడి.. మూఢనమ్మకాలు.. హత్యలు.. అనుమానస్పద మరణాల చుట్టూ కథను అల్లుకొని.. ఓవైపు భయపెడుతూనే థ్రిల్ కి గురిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ని ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన పొలిమేర సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం అయిపోయింది. అప్పుడంటే లాక్ డౌన్ కాబట్టి.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటిటి రిలీజ్ అయ్యింది. కానీ.. ఇప్పుడు పొలిమేర 2 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
నవంబర్ 3న థియేటర్స్ లో రాబోతున్న పొలిమేర 2 నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం పొలిమేరకు మించిన ట్విస్టులు, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు భయానకమైన సన్నివేశాలు కూడా ట్రైలర్ చూపించి థ్రిల్ చేశారు. మీరు గమనిస్తే.. పొలిమేరలో ఎక్కడ కూడా దేవాలయాల మిస్టరీని టచ్ చేయలేదు. కానీ.. ఇప్పుడు సీక్వెల్ లో ఎంతో కాలంగా మూతబడిన దేవాలయ మిస్టరీకి.. చేతబడిని లింక్ చేస్తూ.. ఒళ్ళుగగ్గుర్పాటుకు గురయ్యే విధంగా ట్రైలర్ లో ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. మహబూబ్ నగర్ లో దారుణం.. అసలు చేతబడులు ఉన్నాయా? అనే పాయింట్ తో ట్రైలర్ మొదలైంది.
ఫస్ట్ పార్ట్ లో ఇంటరెస్టింగ్ సస్పెన్స్ తో ముగించిన దర్శకుడు.. ఈసారి సైన్స్, మూఢనమ్మకం మధ్య రాసుకున్నట్లు తెలుస్తుంది. సత్యం రాజేష్, కామాక్షి, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను.. ఇలా చాలా పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ లో జరిగిన దారుణ హత్యలు.. చేతబడి మధ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా మెన్షన్ చేయడం విశేషం. ఆ గ్రామంలోని మిస్టరీని ఎలా తెలుసుకున్నారు.. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. గ్యాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ.. జానర్ కి తగ్గట్టుగా సాగిందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ కంటే సీక్వెల్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టినట్లు ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే తెలుస్తుంది. గౌరీ కృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరి పొలిమేర 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.