Somesekhar
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో మరణించారు.
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో మరణించారు.
Somesekhar
చిత్ర పరిశ్రమలో వరుసగా చోటు చేసుకుంటున్న విషాదాలు అభిమానులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి. తమ అభిమాన నటీ, నటులు, టెక్నీషియన్స్ అకాల మరణాలు పొందడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా ప్రొస్టేట్ క్యాన్సర్ తో పోరాడుతున్న రషీద్ ఖాన్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
దిగ్గజ సంగీత దర్శకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) అనారోగ్య కారణాలతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ప్రోస్టేట్ క్యాన్సర్ తో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన కోల్ కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. యూపీలోని బదౌన్ ప్రాంతంలో జన్మించారు రషీద్ ఖాన్. ఒకే ఒక్క పాటతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జబ్ వి మెట్’ అనే బాలీవుడ్ చిత్రంలోని ‘ఆవోగే జబ్ తుమ్’ అనే పాటతో సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపాడు. మ్యూజిక్ మ్యాస్ట్రోగా గుర్తింపు తెచ్చున్న ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. కళా రంగానికి రషీద్ ఖాన్ అందించిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, 2006లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2022లో పద్మభూషన్ అవార్డును ప్రదానం చేసింది. రషీద్ ఖాన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఓ దిగ్గజ సంగీత దర్శకుడిని సినిమా పరిశ్రమ కోల్పోయిందని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Extremely saddened by the news of music maestro Ustad Rashid Khan passing away. He will be remembered by us; he lives on in our hearts and in music!
Om Shanti 🙏🏻 pic.twitter.com/aaeQEpyxRT— The Hilarious Dancer (@shruti_kathak) January 9, 2024