Venkateswarlu
Venkateswarlu
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పాప్ సింగర్ కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె వారం క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని హాంకాంగ్‌కు చెందిన కోకో లీ ఫ్యామిలీ.. ఆమె చిన్నతనంలోనే అమెరికాకు వెళ్లి స్థిరపడిపోయింది. లీ శాన్‌ఫ్రాన్సిస్ స్కోలోనే తన విద్యను పూర్తి చేసింది. 19 ఏళ్లకే సింగర్‌గా మారింది. పాప్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
అయితే, ఆమె గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. డిప్రెషన్‌కు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటోంది. ఏం చేసినా డిప్రెషన్‌ను ఆమె జయించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె చావును ఆశ్రయించింది. వారం రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం చనిపోయింది. అయితే, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లటానికి గల కారణాలు తెలియరాలేదు.
కాగా, 1998లో యానిమేషన్ రూపంలో ‘ములాన్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను 2020లో రీమేక్ చేశారు. ఈ సారి డిస్నీ సంస్థ మనుషులతో సినిమాను తీసి, విడుదల చేసింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌కు కోకో లీ తన గొంతును అరువిచ్చింది. మరి, 48 ఏళ్ల వయసులో సింగర్ కోకో లీ ఆత్మహత్య చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.