Manchu Manoj Game Show: ఉస్తాద్- రాంప్ ఆడిద్దామంటూ వస్తోన్న మంచు మనోజ్

ఉస్తాద్- రాంప్ ఆడిద్దామంటూ వస్తోన్న మంచు మనోజ్

మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాకింగ్ స్టార్ అయ్యారు మనోజ్. ఆరేళ్ల క్రితం ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరిగా కనిపించాడు. ఆ తర్వాత పలు సినిమాలు ఎనౌన్స్ చేసినా.. అవి ఎక్కడ వరకు వచ్చి తెలియదు. ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తాడు.

మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాకింగ్ స్టార్ అయ్యారు మనోజ్. ఆరేళ్ల క్రితం ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరిగా కనిపించాడు. ఆ తర్వాత పలు సినిమాలు ఎనౌన్స్ చేసినా.. అవి ఎక్కడ వరకు వచ్చి తెలియదు. ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తాడు.

వెండితెరపై అలరించిన హీరోస్.. జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం యాంకర్లుగా మారిపోతున్నారు. బుల్లితెర, ఓటీటీల్లో కొన్ని షోల ద్వారా తమ సత్తాను చాటుతున్నారు. సినిమాలు చేస్తూనే బుల్లితెరపై సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా నాని, జూనియర్ ఎన్టీఆర్‌లు హోస్ట్‌లుగా అదరగొట్టారు. నాగార్జున అలరిస్తూనే ఉన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడుతో చిరంజీవి, అన్ స్టాపబుల్ సిరీస్‌తో బాలయ్య యాంకరింగ్ చూసేశాం. ఇక రానా, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు పలు షోలను హోస్ట్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరిపోయారు. అతడే మన సొట్టబుగ్గల సిన్నోడు, రాకింగ్ స్టార్ మంచు మనోజ్. అతడు బుల్లితెరపై ఓ రియాలిటీ షో చేయబోతున్నానని ఇటీవల వెల్లడించాడు.

తాజాగా ఈ షోకు సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈటీవీ విన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో రియాలిటీ షో తెరకెక్కుతోంది. ఈ గేమ్ షో పేరు ’ఉస్తాద్- రాంప్ ఆడిద్దాం‘. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక, దర్శక నిర్మాత బీవీఎస్ రవి, డైరెక్టర్ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో ఈ గేమ్ షో రాబోతుంది. డిసెంబర్ 15 నుండి నుండి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ షో గెలిచిన ప్లేయర్స్‌కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ షోతో అందర్ని ఎంటర్ టైన్ చేసేందుకు మంచు మనోజ్ సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు. ఈ షో సందర్భంగా ఆయన గురించి వేసిన ఓ ప్రోమో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మనోజ్ కావాలనే బ్రేక్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ  సందర్భంగా మనోజ్ మాట్లాడుతుంటే మౌనిక భావోద్వేగానికి గురయ్యారు

ఈ షో ప్రోమో కూడా విడుదల చేశారు. ‘నేను మీ మనోజ్.. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది‘ అంటూ తన ఫ్యాన్స్ కోసం ఓ రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఈ షో ద్వారా తిరిగి రాబోతున్నారని పేర్కొన్నారు ఈ ఎనర్జీ స్టార్.. మరోసారి ఇక మంచువారబ్బాయి అహం బ్రహ్మస్మి, వాట్ ది ఫిష్ అనే సినిమాలు ప్రకటించాడు. అయితే ఈ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయో లేదో, ఈ మూవీ అప్డేట్స్ ఏంటో మళ్లీ ప్రకటించలేదు. ఆరేళ్ల క్రితం ఒక్కడు మిగిలాడు అనే మూవీలో కనిపించాడు. ఆ తర్వాత టూ మూవీస్‌లో క్యామియో అప్పీయరెన్స్‌లో కనిపించారు. ఇప్పుడు బుల్లితెరపై అలరించేందుకు వచ్చేస్తున్నాడు. దీంతో మళ్లీ మనోజ్ ను ఏదో రకంగా చూస్తున్నామని ఆనందంలో ఉన్నారు అభిమానులు. మరీ ఈ హీరో ఎంత వరకు అలరిస్తారో వేచి చూడాలి. మరీ బుల్లితెరపై మనోజ్ కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments