Venkateswarlu
మహిమా నంబియార్ హీరోయిన్ చాలా సినిమాల్లో నటించారు. ఓ తెలుగు సినిమా విషయంలో ఆమెకు అవమానం జరిగింది. ఆ అవమానం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొస్తూ...
మహిమా నంబియార్ హీరోయిన్ చాలా సినిమాల్లో నటించారు. ఓ తెలుగు సినిమా విషయంలో ఆమెకు అవమానం జరిగింది. ఆ అవమానం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొస్తూ...
Venkateswarlu
సినిమా ఇండస్ట్రీలో అవమానాలు సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ అన్న తేడా లేకుండా ఎవ్వరైనా సరే.. ఏదో ఒక సందర్బంలో అవమానానికి గురి కాకతప్పదు. అయితే, కొన్ని సార్లు ఆ అవమానాల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అలాంటి అవమానాలను మర్చిపోవటం చాలా కష్టం. ముఖ్యంగా నటీమణుల విషయంలో ఇది సెల్ఫ్ రెస్పెక్ట్‌లా తయారు అవుతుంది. ఇక, హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యల్లో.. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత వద్దు పొమ్మనటం ఒకటి. సగం షూటింగ్ జరిగిన తర్వాత కూడా హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను సినిమా నుంచి తొలిగించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ అనుభవం ప్రముఖ బహుభాషా నటి మహిమా నంబియార్‌కు కూడా ఎదురైంది. టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో సినిమాలోకి ఆమెను తీసుకున్నారు. షూటింగ్ కొంత పూర్తయిన తర్వాత.. మహిమను సినిమాలోంచి తీసేశారు. తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఈ సంఘటనను ఆమె ఇప్పటికీ బాగా గుర్తు పెట్టుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి చెబుతూ.. ‘‘ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది నటీమణులు తమకు ఎదురయ్యే అరాచకాలు, అవమానాలపై పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎక్కడి వరకో ఎందుకు నేను కూడా అవమానాలు ఎదుర్కొన్నా.
గతంలో టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం ఓ నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశా. కొంచెం గ్యాప్ ఇచ్చి షూటింగ్ చేద్దామని సినిమా టీం చెప్పింది. కొన్ని రోజులు గడిచాయి. నేను సినిమా షూటింగ్ కోసం పిలుపు వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నాను. ఓ రోజు సినిమా మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. ఓ పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని, నన్ను తప్పుకోమని చెప్పాడు. ఇలాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మహిమా నంబియార్ 15 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2010లో వచ్చిన ‘‘ కార్యస్తాన్’’ అనే మలయాళ సినిమాలో నటించారు. ఆ తర్వాత ‘సాట్టై’ అనే తమిళ సినిమాతో 2012లో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. మాతృభాష మలయాళంలో అరకొరగా అవకాశాలు వస్తున్నాయి. ఆమె తాజాగా, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ‘జై గణేష’అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు.
ఈ చిత్ర శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహిమ ఇప్పటి వరకు 20కిపైగా సినిమాలు చేశారు. వీటిలో ఒక్కటి కూడా తెలుగు సినిమా లేకపోవటం గమనార్హం. టాలీవుడ్‌లో తనకు జరిగిన అవమానం కారణంగా ఆమె సినిమాలు చేయటం లేదో.. లేక అవకాశాలు రాలేదో తెలీదు. మరి, టాలీవుడ్‌లో మహిమ నంబియార్‌కు ఎదురైన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.