ఎప్పటికీ వెనుకడుగు వేయని కథానాయకుడు.. కమల్ నువ్విక మారవా..?

కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించిన అమరన్ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఒక రియల్ హీరో లైఫ్ ను అందరికి పరిచయం చేయబోతున్నారు. సినిమానే ఊపిరిగా భావించే కమల్ కెరీర్ లో ఇలాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయో చూసేద్దాం.

కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించిన అమరన్ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఒక రియల్ హీరో లైఫ్ ను అందరికి పరిచయం చేయబోతున్నారు. సినిమానే ఊపిరిగా భావించే కమల్ కెరీర్ లో ఇలాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయో చూసేద్దాం.

సౌత్ లో కమల్ హాసన్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రయోగాలు , విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపిస్తున్న లోక నాయకుడు ఈ కథా నాయకుడు… ఇండియాలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు కమల్ హాసన్… వెండితెరపై విశ్వరూపం చూపిస్తున్న నట కమలం.. కథకుడిగా వెండి తెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞశాలి.. ఇలా కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మాటలు మిగిలే ఉంటాయి. దాదాపు ఆయన అందరికి ఒక నటుడిగా మాత్రమే పరిచయం. కానీ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా .. ఇలా సినిమానే ఊపిరిగా తీసుకుంటున్న ప్రాణం కమల్ హాసన్. సాధారణంగా ప్రతి నటుడి జీవితంలో హిట్స్ , ప్లాప్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కమల్ జీవితంలోను అంతే… కానీ,  వచ్చిన జయాపజయాలను పట్టించుకోకుండా.. లాభ నష్టాలు చూడకూండా సినిమాలు తీస్తునే ఉంటారు.

ఆయనకు సినిమాలపై ఉన్న పిచ్చి ప్రేమ ఆయనను ఇంతవరకు తీసుకుని వచ్చింది. కమల్ హాసన్ అనగానే అందరికి గుర్తొచ్చేది.. స్వాతి ముత్యం , సాగర సంగమం , మరో చరిత్ర , శుభ సంకల్పం లాంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలే. ఇక ఇప్పటి జనరేషన్ కైతే దశావతారం, విక్రమ్, కల్కి లాంటి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. అలా ఆ తరం.. ఈ తరం కలయికగా రేపటితరం వారు కూడా చెప్పుకునేలా నటుడిగా ఆయన తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు. నవసరసాలను పండించడంలో ఆయన కొట్టిన పిండి. నటనలో విశ్వ రూపం చూపించడంలో ఆయన అనితరసాధ్యుడు. ఇలా ఇండస్ట్రీ లో ఒక నటుడిగా నెగ్గుకురావడమే కష్టం అని భావించే రోజుల్లోనే.. ఓ నిర్మాతగా కూడా ఎదిగి చూపించారు . విక్రమ్ సినిమాతో అది అందరికి అర్థమైంది. ఆ సినిమా కంటే ముందు దాదాపు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ కూడా నష్టాలనే చవి చూశాయి. అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సినిమాను నమ్మాడు. ఆయనకున్న నమ్మకమే.. కమల్ ను మళ్ళీ నిలబెట్టింది.

ఇక రీసెంట్ గా శంకర్ , కమల్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. కమల్ హాసన్ పని అయిపోయిందనుకున్నారు అంతా. కానీ సినిమానే తన ప్రపంచం అనుకునే  ఆయన ఎందుకు ఆగిపోతాడు. బాక్స్ ఆఫీస్ ముందు ఆయన ఫెయిల్ అయినా సరే.. ఇప్పుడు ఒక రియల్ హీరో కథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. దీపావళి కానుకగా రాబోతున్న.. మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీ ‘అమరన్’ మూవీకి.. కమల్ నిర్మాతగా వ్యవహరించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించామా లేదా అనే దానికంటే కూడా.. ఓ మంచి కథను ప్రేక్షకులకు పరిచయం చేశామా లేదా అనే దానిపైనే కమల్ ఫోకస్ చేస్తారు. మరోసారి అమరన్ మూవీతో ఇది ప్రూవ్ అవ్వబోతుంది. దీనితో కమల్ హాసన్ అభిమానులు.. కమల్ నువ్విక మారావా.. అంత పిచ్చి ఏంటయ్యా సినిమాలంటే అంటూ ఆయనను పొగిడేస్తున్నారు. ఇక ఈసారి రాబోతున్న రియల్ హీరో కథ.. కమల్ కు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Show comments