Venkateswarlu
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది.
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది.
Venkateswarlu
నందమూరి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు కళ్యాణ్ రామ్. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. బాబాయ్ బాలకృష్ణ మూవీతో వెండి తెరపైకి వచ్చారు. మొదటి నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నారు. 2003లో వచ్చిన తొలిచూపులోనే చిత్రంతో హీరోగా మారారు. 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో సూపర్‌హిట్‌ను అందుకున్నారు.
2022లో వచ్చిన ‘బింబిసార’తో బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా, డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక, విడుదలకు ముందు హీరో కళ్యాణ్ రామ్ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు మీడియా, సోషల్ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన హీరో నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు ఆయనకు మధ్య ఉన్న బాండింగ్‌ను వివరించారు. ఆయన ఇచ్చిన టిప్స్ కారణంగానే తాను కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ అవుతున్నానని అన్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ప్రతి హీరో సినిమాల విషయంలో ఆడియన్స్ కొన్ని విషయాలను ఇష్టపడతారని అన్నారు. తమ హీరో సినిమాలలో కొందరు డ్యాన్స్ ఇష్టపడవచ్చని, మరికొందరు ఫైట్స్ ఇష్టపడవచ్చని.. లేదా కామెడీ ఏదైనా ఇష్టపడవచ్చని అన్నారు.
వారు కోరుకునే అంశాలు సినిమాలో ఉండేలా జాగ్రత్త పడాలని నాగార్జున బాబాయ్ చెప్పారన్నారు. డిఫరెంట్ స్టోరీలను ట్రై చేసినా కూడా ప్రేక్షకులు ఆశించే విషయాలు సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటూ ఓ సారి బాబాయ్ తనకు సలహా ఇచ్చారన్నారు. ఆరోజు ఆయన చెప్పిన విషయాలను తాను ఎప్పటికీ మర్చిపోలేదని, అందుకే తన సినిమాలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారనే విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు.
ఆ సలహాలే తన సక్సెస్ కు కూడా కారణం అయ్యాయని కళ్యాణ రామ్ తెలిపారు. కాగా, డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జంటగా.. సంయుక్త మీనన్ నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అభిషేక్ నామా దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతులు కూడా చేపట్టారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. మరి, నాగార్జున బాబాయ్ ఇచ్చిన సలహాల కారణంగానే తాను కెరీర్‌లో సక్సెస్ అయ్యానంటున్న కళ్యాణ రామ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.