Nidhan
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర చేస్తోంది.
Nidhan
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర చేస్తోంది. రిలీజైన రెండ్రోజుల్లో దాదాపుగా రూ.300 కోట్ల వరకు కలెక్ట్ చేసిందీ ఫిల్మ్. ‘కల్కి’ జోరు చూస్తుంటే ఈజీగా రూ.1,000 కోట్ల మార్క్‌ను దాటుతుందని అనిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్-అమితాబ్ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎంకు అందరూ ఫిదా అయిపోతున్నారు. మహాభారతంలోని పాత్రలతో ఇంత బాగా సైన్స్ ఫిక్షన్ అంశాన్ని జోడించి సినిమా తీయడంపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కల్కి’ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్టింగ్ కంటే కూడా పురాణ పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్‌ను ఆయన మలిచిన తీరుకు వహ్వా అంటున్నారు. అయితే ‘కల్కి’లో వీటితో పాటు మరో గొప్ప పాత్రను కూడా చూపించాడు నాగీ. కానీ దాన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. చిరంజీవుల్లో ఒకడైన పరశురాముడి క్యారెక్టర్ అది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేశారు. అయితే సినిమా చూసేటప్పుడు దుల్కర్ది సాధారణ పాత్రేనని అంతా అనుకున్నారు. భైరవ (ప్రభాస్)ను పెంచే తండ్రిగా ఆయన కనిపించారు. సినిమాలో ఈ రోల్ కొద్ది సేపే ఉంటుంది.
దుల్కర్ పాత్రకు పెద్దగా ఎలివేషన్స్ ఉండవు. సింపుల్‌గా చూయించేశాడు నాగ్ అశ్విన్. దీంతో ఆయన ఎందుకు ఈ రోల్‌కు ఒప్పుకున్నాడని కొందరు సందేహించారు. అయితే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ‘కల్కి’ మూవీలో ప్రభాస్‌కు యుద్ధవిద్యలు, ఎలా బతకాలి అనేవి నేర్పిస్తూ కనిపించారు దుల్కర్. సినిమా ఆఖర్లో ప్రభాస్ క్యారెక్టర్ కర్ణుడిగా రివీల్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే దుల్కర్ పాత్రను మాత్రం బయటపెట్టలేదు. పురాణాల ప్రకారం.. కర్ణుడితో పాటు కల్కికి యుద్ధవిద్యలు నేర్పేది పరశురాముడే. ఆ లెక్కన ‘కల్కి’ సినిమాలో ప్రభాస్‌కు మిలట్రీ ట్రైనింగ్ ఇచ్చిన దుల్కరే పరశురాముడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నప్పటి ప్రభాస్ పెద్దయ్యాక కూడా దుల్కర్ యంగ్‌గానే కనిపిస్తారు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకరు. కాబట్టి మరణం ఉండదు, వయసు పెరగదు. అందుకే దుల్కర్‌ను అలా యవ్వనంగా చూపించారని నెటిజన్స్ అంటున్నారు. ఇంత పవర్ఫుల్ రోల్‌ను సింపుల్‌గా చూపించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దుల్కర్ క్యారెక్టర్ ఇక్కడితో ముగిసిపోలేదని.. సెకండ్ పార్ట్‌లో ఆయన్ను మరింత శక్తిమంతంగా చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
According to the Puranas, Parshuram is the teacher/trainer of both Karna and Kalki. Bhairava also says that Pilot(DQ) taught him everything. Parshuram doesn’t age. If you observe in the movie, DQ looks the same when Bhairava is a child and also when he is older. #Kalki2898AD pic.twitter.com/rrpbsLmnf7
— Hail DulQuer (@haildulQuer) June 28, 2024