Swetha
రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ లో రెస్పాన్ దక్కుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఇప్పటివరకు వచ్చిన అన్ని రీరిలీజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. పైగా 90 వ దశకంలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ దక్కడం విశేషం.
రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ లో రెస్పాన్ దక్కుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఇప్పటివరకు వచ్చిన అన్ని రీరిలీజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. పైగా 90 వ దశకంలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ దక్కడం విశేషం.
Swetha
అప్పటినుంచి ఇప్పటివరకు చిరుకు చిరు సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి సినిమా ఏది రిలీజ్ అయినా ఆయన అభిమానులు కచ్చితంగా థియేటర్లుకు పోటెత్తుతారు. కానీ ఎప్పుడో 35 ఏళ్ళ నాటి సినిమా రీరిలీజ్ అయితే ఇప్పుడు అభిమానులతో పాటు పిల్లలు , యూత్ వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి వెళ్లడం చెప్పుకోదగిన విషయం. ఇప్పటివరకు రీరిలీజ్ అయినా సినిమాలు ఓ లెక్క జగదేకవీరుడు అతిలోకి సుందరి రీరిలీజ్ ఓ లెక్క అన్నట్లు… బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్కలు తిరగరాస్తుంది ఈ మూవీ.
హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మొదటి రోజే పన్నెండు లక్షలకు పైగా గ్రాస్ నమోదు కావడం అసలు చిన్న విషయం కాదు. ఇక వీకెండ్ షోస్ అయితే చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. అలా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండున్నర కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. వారు తమ చిన్నప్పుడు వారి తల్లితండ్రులతో కలిసి చూసిన సినిమా.. ఇప్పుడు వారి పిల్లలతో కలిసి 3డి లో చూడడం.. ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని అభిమానులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అక్కడక్కడ ప్రింట్ క్వాలిటీ గురించి కొంత కంప్లైంట్స్ ఉన్నా కానీ.. చిరంజీవి శ్రీదేవి తెరమీద చేసే అద్భుతం ముందు.. ఆ వింటేజ్ ఫీలింగ్ ముందు ప్రేక్షకులు ఇవేమి పట్టించుకోలేదు. ఒక్కసారిగా అంతా 90 ల కాలానికి వెళ్లిపోయారని చెప్పి తీరాల్సిందే. జెనెరేషన్ తో సంబంధం లేకుండా ఈ రీరిలీజ్ ను మాత్రం ప్రతి ఒక్కరు ఆదరించడం విశేషం. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే.. ఈ తరహా క్లాసిక్ సినిమాలు ఇంకా బయటకు వచ్చేలా ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.