జగదీక వీరుడు అతిలోక సుందరి కమెడియన్ ఎంతలా మారిపోయాడో చూశారా.. పాపం అంటారు

టాలీవుడ్ నాట ఎంతో మంది కమెడియన్లు ఉన్నా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య నటుల్ని కూడా ఆదరించిన గొప్ప మనస్సు కేవలం టీటౌన్ ప్రేక్షకులకు మాత్రం ఉంది. ఆ నటుల్లో ఒకరు జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలో

టాలీవుడ్ నాట ఎంతో మంది కమెడియన్లు ఉన్నా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య నటుల్ని కూడా ఆదరించిన గొప్ప మనస్సు కేవలం టీటౌన్ ప్రేక్షకులకు మాత్రం ఉంది. ఆ నటుల్లో ఒకరు జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలో

ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు.. మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. రాజబాబు, రేలంగి, పద్మనాభం, బ్రహ్మనందం, బాబు మోహన్,ఆలీ, సుధాకర్, ధర్మవరపు సుబ్రమణ్యం, వైవీఎస్, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, చిట్టిబాబు, సునీల్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్, సప్తగిరి, సత్య, వైవా హర్ష, ధన్ రాజ్, వేణు, వెన్నెల కిశోర్ వంటి తెలుగు హాస్య నటుల్నే కాదూ.. పొరుగింటి కమెడియన్స్ ను కూడా ఆదరించాం. మనోరమ, నగేశ్, వివేక్, గౌండమణి, సెంథిల్, వడివేలు, మనోబాల, సంతానం, సతీష్, ఓమకుర్చీ నరసింహన్, సత్యన్, యోగి బాబు, కొవై సరళ, మణి వన్నన్, జనగ్‌రాజ్, సూరి వరకు ఎంతో మంది హాస్య నటుల్ని ఓన్ చేసుకున్నాం.

ఇంత మంది తమిళ హాస్య నటుల్ని బహుశా ఏ ఇండస్ట్రీ కూడా ఆదరించి ఉండదు.. ఒక్క టాలీవుడ్ పరిశ్రమ తప్ప. తెలుగులో ఒక్క సినిమా అయినా చేయాల్సిందే. అలా కేవలం రెండు సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న కమెడియన్ జనగ్‌రాజ్. అతడి పేరు తెలియకపోవచ్చు.. కానీ జగదీక వీరుడు అతిలోక సుందరిలో ‘ఎక్కడికో వెళ్లిపోయావ్ రా మాలోకం’ అంటూ ఎస్సై పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడు కదా.. అతడే ఈ కమెడియన్. 1978 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అంటే సుమారు 45 ఏళ్లకు పైగా సినిమాలే లోకంగా బతికేశాడు. 225 పైగా చిత్రాల్లో నటించిన ఆయన సినిమాలు చేయడం లేదు. కొన్ని నెలల క్రిితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇటీవల వెండితెరకు కనుమరుగవ్వడంపై జనగ్‌రాజ్ స్పందించాడు. ‘నేను అమెరికా వెళ్లి సెటిల్ అయ్యానని చాలా మంది చెబుతున్నారు. కానీ నేనెప్పుడూ అమెరికా వెళ్లలేదు. నిజం చెప్పాలంటే నాకు వీసా కూడా లేదు. కావాలంటే నా పాస్ పోర్టు చూడండి. నేనెప్పుడు వెళ్లని దేశానికి వెళ్లగలను ఎలా చెబుతారు. నేనను చెన్నైలోనే ఉన్నాను. కానీ నేను ఇక్కడ లేదని సోషల్ మీడియా చెబుతోంది. దీంతో నాకు సినిమా అవకాశాలు రావడం లేదు. నేనేదో జబ్బు పడ్డాడని, నన్ను రజనీ సార్ చూసేందుకు వచ్చారని కథనాలు రాశారు. దీంతో ఎంతో మంది ఫోన్ చేసి అడిగారు. మనస్సుకు ఎంతో బాధ అనిపించింది. ఎంత మందికి నేను సమాధానం చెప్పగలను’ అని చెప్పుకొచ్చారు.

‘కరోనా నుండి నేను కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఆ తర్వాత నాకు మంచి పాత్రలే రాలేదు. తొలుత 90 కిలోలు ఉండేవాడిని కానీ నేడు 64 కిలోలకు తగ్గాను. నా భార్య నన్ను బాగా చూసుకుంటుంది. నేను ఎంత టెన్షన్‌లో ఉన్నా రిలాక్స్‌గా ఉంటాను. నా భార్యతో ఎప్పుడు గొడవ పడలేదు. నా కొడుకు నన్ను చూసుకుంటాడు. నేను సంతోషంగా ఉన్నాను. అవకాశం వస్తే చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ కమెడియన్. కాగా, తెలుగులో జగదీక వీరుడు అతిలోక సుందరి తర్వాత, దాడి అనే చిత్రంలో కనిపించాడు ఈ నటుడు.

Show comments