బ్రేకింగ్: భారీ బందోబస్తు మధ్య.. నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ కూల్చివేత..!

Abolition of The N-Convention: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తూ వచ్చింది హైడ్రా. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభించారు.

Abolition of The N-Convention: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తూ వచ్చింది హైడ్రా. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభించారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) అధికారులు కూల్చి వేస్తున్నారు. శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేతలు ప్రారంభించారు. హైటెక్ సిటీకి దగ్గరలోని తుమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాల స్థలాన్నికబ్జా చేసుకొని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని నిర్మించినట్లు గత కొంత కాలంగా ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే.  నగరంలోని పలు ఖాళీ స్థలాలు, చెరువును  అక్రమంగా ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తు వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాదాపూర్ హైటెక్ సిటీలోని తుమ్మిడి కుంట చెరువు ఎఫ్‌టీఎల్ లో కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు పరిగణలోకి తీసుకొని హైడ్రా స్పందించింది. శనివారం ఉదయం నుంచి కూల్చి వేత ప్రారంభించింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఇదిలా ఉంటే ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. అంతేకాదు ఎన్ కన్వేన్షన్ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వాస్తవానికి గత కొంత కాలంగా ఈ విషయంపై పలుమార్లు మీడియా ఛానల్స్ లో కూల్చి వేస్తారని వార్తలు వచ్చాయి.. కానీ అది మాత్రం జరగలేదు.  ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమించి కట్టుకున్న కట్టడాలపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఎన్  – కన్వేన్షన్ కూల్చి వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Show comments