హాయ్‌ నాన్నలో మెయిన్‌ రోల్‌.. ఈ డాగ్‌ బ్రీడ్‌ గురించి మీకు తెలుసా?

హాయ్‌ నాన్న సినిమాలో హీరో, హీరోయిన్లు, సైడ్‌ క్యారెక్టర్లతో పాటు ఓ కుక్క బాగా ఫేమస్‌ అయిపోయింది. ఈ చిత్రంలో ఆ కుక్కది ఒకరకంగా మెయిన్‌ రోల్‌ కూడా. కథలో కీలకంగా వ్యవహరిస్తుంది...

హాయ్‌ నాన్న సినిమాలో హీరో, హీరోయిన్లు, సైడ్‌ క్యారెక్టర్లతో పాటు ఓ కుక్క బాగా ఫేమస్‌ అయిపోయింది. ఈ చిత్రంలో ఆ కుక్కది ఒకరకంగా మెయిన్‌ రోల్‌ కూడా. కథలో కీలకంగా వ్యవహరిస్తుంది...

అన్ని సినిమాల్లో మనుషులే కీలక ప్రాతలుగా ఉండాలన్న రూలేమీ లేదు. కొన్ని కథల్లో  జంతువులు కూడా కీలకంగా మారుతుంటాయి. ఇందుకు హాయ్‌ నాన్న సినిమానే తాజా ఉదాహరణ. ఈ చిత్రంలో ఓ కుక్క కీలక పాత్ర పోషించింది. కథలో కీలకంగా మారింది. సినిమాలో ఆ కుక్క పేరు ‘ప్లూటో’. సినిమా మొదలైనప్పటినుంచి ఎండింగ్‌ వరకు ఆ కుక్కకు ఫుల్‌లెన్త్‌ క్యారెక్టర్‌ ఉంది. ఇప్పుడు ఆ కుక్క సోషల్‌ మీడియా బాగా వైరల్‌గా మారింది. ఈ మధ్య కాలంలో నటులకు కాకుండా ఓ కుక్క ఇంత క్రేజ్‌ రావటం విశేషం.

ఇంతకీ హాయ్‌ నాన్నలో ప్లూటో క్యారెక్టర్‌లో నటించిన ఆ కుక్క బ్రీడ్‌ ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం?… హాయ్‌ నాన్నలో ప్లూటో క్యారెక్టర​ చేసిన కుక్క బ్రీడ్‌ పేరు ‘గోల్డెన్‌ రీట్రైవర్‌’. ఇవి మిగిలిన కుక్కలతో పోల్చుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ బ్రీడ్‌ను 19వ శతాబ్ధంలో స్కాట్‌లాండ్‌లో వృద్ధి చేశారు. సర్‌ డబ్లీ మర్జోరీబ్యాంక్స్‌ ఈ బ్రీడ్‌ను కనిపెట్టారు. ట్వీడ్‌ వాటర్‌ స్పానియల్స్‌, బ్రిటిష్‌ కుక్కలను క్రాస్‌ బ్రీడింగ్‌ చేయించి గోల్డెన్‌ రీట్రైవర్‌ను డెవలప్‌ చేశారు.

ఇవి చాలా తెలివైనవి పైగా.. మనుషులతో ఎంతో చక్కగా కలిసిపోతాయి. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప మనుషులపై దాడి చేయవు. వీటికి శిక్షణ ఇవ్వటం కూడా చాలా సులభం. కుటుంబసభ్యుల్ని సంరక్షించడానికి ఇవి ఎంతకైనా తెగిస్తాయి. 12 నుంచి 13 సంవత్సరాల కాలం పాటు బతుకుతాయి. సినిమాల కోసం ఎక్కువగా ఈ బ్రీడ్‌ కుక్కల్నే వాడుతూ ఉంటారు. ఎందుకంటే.. ఇవి చెప్పిన దాన్ని చక్కగా అర్థం చేసుకుంటాయి. బాగా యాక్టింగ్‌ చేయగలవు.

ఇవి ఈత బాగా కొట్టగలవు. ఈతను ఎక్కువగా ఇష్టపడతాయి కూడా. కేవలం మనుషులనే కాదు.. తనతో స్నేహం ఉన్న ఇతర జంతువులను కూడా ఇవి సంరక్షిస్తాయి. వీటిని ఎక్కువ రోజులు ఒంటరిగా వదిలేస్తే డిప్రెషన్‌కు గురవుతాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్కల్లో నాలుగవ స్థానంలో ఉన్నాయి. ఇవి వాసన పసిగట్టడంలోకూడా ముందుంటాయి. వీటి ధర ఇండియన్‌ మార్కెట్‌లో 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ఉంది.

కాగా, హాయ్‌ నాన్న సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. విడుదలైన అన్ని భాషల్లో చిత్రానికి మంచి స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే దాదాపు 19 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. మరి, హాయ్‌ నాన్నలో ప్లూటో పాత్రలో మెప్పించిన గోల్డెన్‌ రీట్రైవర్‌ డాగ్‌ బ్రీడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments