సిక్వెల్స్ అంటే గుర్తొచ్చేది హీరో కార్తీనే..

టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా అంటే ఒకటే పార్ట్.. ఆ రెండున్నర గంటల్లోనే చెప్పాల్సిందంతా చూపించేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి రెండు పార్ట్శ్ తో జక్కన్న ఎంటర్ అయ్యాడో ఇక అప్పటినుంచి ఈ సిక్వెల్ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు సిక్వెల్స్ హీరో అంటే అందరికి కార్తినే గుర్తొస్తున్నాడు. ఆ విషయాలేంటో చూసేద్దాం.

టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా అంటే ఒకటే పార్ట్.. ఆ రెండున్నర గంటల్లోనే చెప్పాల్సిందంతా చూపించేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి రెండు పార్ట్శ్ తో జక్కన్న ఎంటర్ అయ్యాడో ఇక అప్పటినుంచి ఈ సిక్వెల్ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు సిక్వెల్స్ హీరో అంటే అందరికి కార్తినే గుర్తొస్తున్నాడు. ఆ విషయాలేంటో చూసేద్దాం.

ఒక కథను రెండు భాగాలుగా తీయాలంటే దానికి చాలా డెడికేషన్ కావాలి. తీస్తున్న రెండు భాగాలూ ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా అనిపించాలి. అలా కన్విన్స్ చేయడంలో రాజమౌళి దిట్ట. రాజమౌళి బాహుబలి తర్వాత సిక్వెల్స్ కాస్త ట్రెండ్ గా మారాయి. ఒక కథను రెండు భాగాలలో చూపించడం. అందులోని క్యారెక్టర్స్ తో మరో కథను బిల్డ్ చేయడం.. వాటిని ఫ్రాంచైజ్ గా మార్చడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఫైనల్ గా ఆడియన్స్ వాటికి కన్విన్స్ అయ్యారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ను అందిపుచ్చుకున్న హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు మాత్రం కార్తీదే.

ఎందుకంటే ప్రెసెంట్ సౌత్ లో అందరికంటే ఎక్కువగా సిక్వెల్స్ , ఫ్రాంచైజ్ సినిమాలు చేస్తున్న హీరో కార్తినే. ఆల్రెడీ కార్తీ తన సర్దార్ సినిమాకు సిక్వెల్ చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరికొద్ది నెలల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక అది కాకుండా రీసెంట్ గా హిట్ 3 క్లైమాక్స్ లో కార్తీ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. సో హిట్ 4 లో మెయిన్ లీడ్ కార్తీ ఏ అని అర్థమైపోతుంది. ఈ రెండు కాకుండా అతను నటించబోయే మోస్ట్ పాపులర్ సిక్వెల్ ఖైదీ 2. ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడని చెప్పి తీరాల్సిందే. ఇవన్నీ కాకుండా కార్తీ స్పెషల్ మూవీ ఖాకి కి కూడా సిక్వెల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమే తెలియదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం.. కార్తీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సిక్వెల్స్ కన్ఫర్మ్. ఇక ఆ మధ్య వచ్చిన కంగువ మూవీలో క్లైమాక్స్ లో కూడా కార్తీని చూపించారు. దానికి సిక్వెల్ అయితే అనౌన్స్ చేశారు కానీ.. మొదటి పార్ట్ డిజాస్టర్ కావడంతో రెండో పార్ట్ కూడా ఆగిపోయినట్లే అని అంటున్నారు. ఒకవేళ అది సక్సెస్ అయితే కార్తీ లిస్ట్ లో కంగువా-2 కూడా ఉండేది. ఇలా కార్తీ డైరీ అంతా కూడా సిక్వెల్స్ తో ఫుల్ అయిపోయిందని చెప్పి తీరాలి. ఇక కార్తీ ఈ సినిమాలతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments