Hanu Man Movie Team Daring Step: ఒకరోజు ముందే హనుమాన్! వీళ్ల కాన్ఫిడెన్స్ చూస్తే..

Hanu Man Movie: ఒకరోజు ముందే హనుమాన్! వీళ్ల కాన్ఫిడెన్స్ చూస్తే..

తేజా సజ్జా సూపర్ హీరో పాత్రలో వస్తున్న హనుమాన్ చిత్రం సంక్రాంతి కానుగా రాబోతోంది. ఈ మూవీ టీమ్ ఇప్పుడు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు.

తేజా సజ్జా సూపర్ హీరో పాత్రలో వస్తున్న హనుమాన్ చిత్రం సంక్రాంతి కానుగా రాబోతోంది. ఈ మూవీ టీమ్ ఇప్పుడు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. తెలుగు వారికి సంక్రాంతి అంటే కోడి పెందేలు, పిండి వంటలు మాత్రమే కాదు.. సినిమాలు కూడా ఉండాల్సిందే. ఫ్యామిలీతో కలిసి ఒక మంచి సినిమా చూడకపోతే సంక్రాంతి సంబరాలు పూర్తి కాలేదన భావనకు వచ్చేస్తారు. అందుకే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈసారి ఆ డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి బరిలోకి 5 పెద్ద సినిమాలు దిగుతున్నాయి. వాటిలో తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న హనుమాన్ కూడా ఒకటి. నిజానికి అందరూ ఈ పోటీ నుంచి హనుమాన్ తప్పుకుంటుంది అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఇప్పుడు వీళ్లు మరో డేరింగ్ స్టెప్ కూడా తీసుకుంటున్నారు.

పండగ సీజన్ తో సంబంధం లేకుండా పెద్ద పెద్ద హీరోల చిత్రాలు ఉంటే ఎవరైనా కూడా తమ సినిమా పోస్టు పోన్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ, హనుమాన్ టీమ్ మాత్రం తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఎవరి సినిమా ఉన్నా మాకు మా చిత్రంపై నమ్మకం ఉందంటూ చెబుతున్నారు. అలాగే తమకు ఆ రామయ్య, అంజనీపుత్రుడి ఆశీస్సులు ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెనక్కి తగ్గకుండా సంక్రాంతికి రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా.. మరో డేరింగ్ స్టెప్ కూడా తీసుకున్నారు. అదేంటంటే.. జనవరి 11న పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు హనుమాన్ టీమ్ సిద్ధమవుతోందని టాక్ వచ్చింది.

దేశవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అవుతున్నారట. ఇది డేరింగ్ స్టెప్ ఎందుకు అవుతుందంటే.. వారికి వారి కంటెంట్ మీద నమ్మకం ఉండబట్టే ఈ డెసిషిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్ లేకుండా ఉంటే తొలిరోజు కలెక్షన్స్ సినిమా హైప్ ని బట్టి వస్తాయి. కానీ, ప్రీమియర్ పడితే మాత్రం టాక్ బయటకు రావడం వల్ల ఫస్ట్ డే కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉటుంది. మొదటి నుంచి హనుమాన్ చిత్ర బృందం చెబుతున్న ఒకే ఒక మాట మా సినిమాపై మాకు నమ్మకం ఉందని. ఇప్పుడు ఈ ప్రీమియర్స్ విషయంలో కూడా అదే నిజమవుతోంది. తాజాగా విడుదలైన శ్రీరామ దూత స్త్రోత్రం సాంగ్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తోంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. ఒక సూపర్ హీరోగా తేజా సజ్జ కనిపించబోతున్నాడు. అది కూడా హనుమంతుడి కాన్సెప్ట్ తో వస్తున్న సూపరో ఫిల్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కూడా ఒక భాగం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను డైరెక్టర్, నిర్మాతలు ఖండించలేదు.. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. మరి.. హనుమాన్ చిత్రం ప్రీమియర్స్ వేయబోతోంది అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments