Guntur Kaaram: ‘గుంటూరు కారం’ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కార్ అనుమతి!

‘గుంటూరు కారం’ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కార్ అనుమతి!

Guntur Kaaram Movie: మాటల మాంత్రికుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో అందాల బామ్మ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకుసంబంధించి తెలంగాణ సర్కార్ ఓ న్యూస్ చెప్పింది.

Guntur Kaaram Movie: మాటల మాంత్రికుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో అందాల బామ్మ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకుసంబంధించి తెలంగాణ సర్కార్ ఓ న్యూస్ చెప్పింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుంటూరు కారం.   ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. ఇప్పటికే ఈ  సినిమా ట్రైలర్ , సాంగ్స్  అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మూవీ టీమ్ కి సంతోషం కలిగించే  విషయం తెలంగాణ సర్కార్ నుంచి వచ్చింది. టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటితో పాటు బెన్ ఫిట్ షోలకు అనుమతి లభించింది.

గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అదే విధంగా గుంటూరు కారం బెన్ ఫిట్ షోలకి కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12న అర్థరాత్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శనలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. గుంటూరు కారం ఆరో షో ప్రదర్శనకు కూడా అనుమతి లభించింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

Show comments