‘ఆయ్’ టీమ్ గొప్ప నిర్ణయం.. AP వరద బాధితులకు ఆర్థిక సాయం!

ఏపీని వరదలు, వానలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాల్లోకి నీళ్లు చేరాయి. దీంతో ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయ్ టీమ్ గొప్ప నిర్ణయం తీసుకుంది.

ఏపీని వరదలు, వానలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాల్లోకి నీళ్లు చేరాయి. దీంతో ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయ్ టీమ్ గొప్ప నిర్ణయం తీసుకుంది.

వర్షాలతో, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్ర, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. రోడ్లపైకి వరద నీరు నదిలా పొంగి పొర్లుతుంది. విజయవాడ నగరం నీట మునిగింది. బుడమేరు పొంగిపొర్లడంతో సింగ్ నగర్, రాజరాజేశ్వరి, అంబాపురం, పాయకాపురం ప్రాంతాల్లో ఇల్లు నీటమునిగాయి. ఇటు ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు బాధితులు. తిండి కాదు కదా తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎటు వెళ్లలేని పరిస్థితి. అయితే అక్కడ ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయ్’ టీమ్ గొప్ప నిర్ణయం తీసుకుంది.

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ఏపీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది ఆయ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఈ సంస్థ నిర్మించిన ఆయ్ చిత్రానికి ఇవాళ్లి నుండి వీకెండ్ వరకు వచ్చే వసూళ్లలో 25 శాతం (షేర్ లో) విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నేటి (సెప్టెంబ‌ర్ 2) నుంచి ఈ నెల 8వ తేదీ వరకు వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌లో 25 శాతం వంతు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత బన్నీ వాస్ ప్రకటించారు. ఆయ్ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదలైన సంగతి విదితమే. ఇప్పటికి థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.40 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది.

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రమే ఆయ్. నయన సారిక హీరోయిన్. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీని అంజి కె మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఆయ్ సినిమాను నిర్మించారు. తొలి షో నుండి పాజిటివ్ రివ్యూస్ రావడంతో హిట్ మూవీగా నిలిచింది. ‘మ్యాడ్’ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నార్నే నితిన్.. ఈ మూవీతో మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, గోపి, సురభి ప్రభావతి, వినోద్ కుమార్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Show comments