గోపీచంద్- హర్షా కాంబో భీమా ట్రైలర్ ఎలా ఉందంటే?

Bhimaa Movie Trailer Review: గోపీచంద్- హర్షా కాంబోలో వస్తున్న భీమా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా కారణంగా చెప్పచ్చు.

Bhimaa Movie Trailer Review: గోపీచంద్- హర్షా కాంబోలో వస్తున్న భీమా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా కారణంగా చెప్పచ్చు.

మ్యాచోమ్యాన్ గోపీచంద్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ పడబోతున్న సంకేతాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. కెరీర్ లో సరైన్ హిట్టు కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కు ఏ హర్షా రూపంలో ఆ అవకాశం దక్కినట్లు కనిపిస్తోంది. వీళ్ల కాంబోలో వస్తున్న భీమా మూవీకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. పురాణాలు, తాంత్రిక శక్తులు, మహాకాళుడు, పరశురాముడు అంటూ ఇతిహాసాలకు పోలీసు స్టోరీని యాడ్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ఒక పెద్ద ఎద్దు మీద గోపీచంద్ ని కూర్చోబెట్టి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ మూడింతలు అవుతుంది.

ఈ ట్రైలర్ లో చెప్పిన కథ ఏంటంటే.. మహావిష్ణువు ఆరో అవతారం అయిన పరశురాముడు తన గండ్ర గొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలను సృష్టించాడు. దానిని పరశురాముడి క్షేత్రం అంటారు. అక్కడ సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువుదీరాడు. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు ఆ మహాకాళుడు.. కరుణే చూపని ఒక బ్రహ్మరాక్షసుడిని పంపిస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడే గోపీచంద్. అసలు ఆ గ్రామంలో ఆ రాక్షసులు ఏం చేస్తుంటారు? అక్కడకు గోపీచంద్ పోలీసుగా ఎందుకు వచ్చాడు? అక్కడ పరీష్కారం కాని సమస్యలు ఏమున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అయితే ట్రైలర్ చూసిన తర్వాత మొదలవుతున్నాయి.

ఇంక ఈ ట్రైలర్ లో డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. డైలాగ్స్ ఎంతో బలంగా ఉన్నాయి. “ఆ త్రినేత్రుడే కాళనేత్రుడై.. కరుణే చూపని ఓ బ్రహ్మరాక్షసుడిని పంపాడు”.. “నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊరిలో శ్మశానం కూడా సరిపోదు” ఇలాంటి డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెచేస్తున్నాయి. ఓవైపు పోలీసుగా చూపిస్తూనే.. మరోవైపు పంచకట్టులో గోపీచంద్ పోరాటాలు చేస్తున్నట్లు చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్ తో భీమా సినిమాపై అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ ఆసక్తిగా, ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ భీమా మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మరి.. భీమా ట్రైలర్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments