కంపెనీ ఓనర్ రజినీ ఫ్యాన్ అయితే ఇలాగే ఉంటుంది! జైలర్ కోసం షాకింగ్ నిర్ణయం!

  • Author ajaykrishna Published - 01:14 PM, Thu - 10 August 23
  • Author ajaykrishna Published - 01:14 PM, Thu - 10 August 23
కంపెనీ ఓనర్ రజినీ ఫ్యాన్ అయితే ఇలాగే ఉంటుంది! జైలర్ కోసం షాకింగ్ నిర్ణయం!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఎప్పుడైనా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో తలైవార్ పేరు వింటే చాలు.. అభిమానులలో పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి. తాజాగా రజినీ నుండి జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. జైలర్ రిలీజ్ అవుతుందని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫస్ట్ డే హాలిడే ప్రకటించిన విషయం విదితమే. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు టికెట్స్ ఫ్రీగా అందించాయి. కానీ.. ఓ కంపెనీ సీఈఓ మాత్రం.. రజినీ కల్ట్ ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

తమిళనాడుకు చెందిన ఫ్రెష్ వర్క్స్ కంపెనీ ఫౌండర్, సీఈఓ గిరీష్ మాతృబూతం.. జైలర్ సినిమా రిలీజ్ సందర్బంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అది విన్న వారందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. రజినీకి కల్ట్ ఫ్యాన్ అయిన గిరీష్.. తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ ఏకంగా థియేటర్స్ బుక్ చేసి.. జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నాడు. గిరీష్ ఫ్రెష్ వర్క్స్ కంపెనీలో సుమారుగా 2200 మంది ఉద్యోగులు వర్క్ చేస్తున్నారట. వారికోసం జైలర్ స్పెషల్ షోస్ వేసేందుకు ఏకంగా 7 మూవీ స్క్రీన్స్ బుక్ చేసాడట. ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తెలిపాడు గిరీష్. దీంతో ప్రస్తుతం గిరీష్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఫ్రెష్ వర్క్స్ కంపెనీకి చెన్నైతో పాటు హైదరాబాద్, బెంగుళూరు సిటీలలో కూడా బ్రాంచీలు ఉన్నాయి. దాదాపు 2200 మంది ఎంప్లాయిస్ వర్క్ చేస్తున్నారు. అయితే.. కంపెనీ సీఈఓ గిరీష్.. సూపర్ స్టార్ రజినీకి వీరాభిమాని కావడంతో తమ ఎంప్లాయిస్ కి జైలర్ స్పెషల్ షోస్ వేయాలని నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా జైలర్ మూవీని ఫ్రెష్ వర్క్స్ ఎంప్లాయిస్ ఫస్ట్ డేనే చూడబోతున్నారు. అయితే.. గిరీష్ తన ఉద్యోగులకు రజినీ సినిమా చూపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కబాలి, రోబో, కొచ్చాడయన్, లింగా సినిమాలకు ఇలానే చేసినట్లు సమాచారం. దీంతో ప్రెజెంట్ గిరీష్ పేరు తమిళనాడులో ట్రెండ్ అవుతోంది. మరి రజినీ కల్ట్ ఫ్యాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments