టాలీవుడ్ బాగుపడాలంటే.. మారాల్సింది హీరోలే.. లేకుంటే కష్టమే..!

టాలీవుడ్ స్థాయి దేశాలను దాటి ఖండాంతరాలకు చేరింది. దీంతో హీరోను ప్రజెంట్ చేసే విధానం, మూవీ తీసే విధానం పూర్తిగా మారిపోయింది. ఈ సమయంలోనే నిర్మాతలకు చిక్కులు ఎదురౌతున్నాయి. స్టార్ హీరో మార్కెట్ ను బట్టి మూవీస్, రెమ్యునరేషన్, ఇతర కాస్టింగ్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని.. అయితే

టాలీవుడ్ స్థాయి దేశాలను దాటి ఖండాంతరాలకు చేరింది. దీంతో హీరోను ప్రజెంట్ చేసే విధానం, మూవీ తీసే విధానం పూర్తిగా మారిపోయింది. ఈ సమయంలోనే నిర్మాతలకు చిక్కులు ఎదురౌతున్నాయి. స్టార్ హీరో మార్కెట్ ను బట్టి మూవీస్, రెమ్యునరేషన్, ఇతర కాస్టింగ్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని.. అయితే

ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచంలో తెలుగు సినీ పరిశ్రమదే పై చేయి. బాహుబలి చిత్రం నుంచి తెలుగు సినిమా జెండా యావద్భారతదేశంలో అన్నిటికన్నా అత్యున్నత స్థాయిలో, లేదా ఇతర భాషా పరిశ్రమలు అసూయ పడే రేంజ్లో రెపరెపలాడుతోంది. తర్వాత వచ్చిన పుష్ఫ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగువారి ప్రతిష్టను మరింత బలపరిచాయి. ఇంక తెలుగువారికి తిరుగులేదన్న ఇమేజ్ తెలుగు సినీ పరిశ్రమ సొంతం చేసుకోవడం ఇటీవలి రోజుల్లో మనం ప్రత్యక్షంగా చూశాం. చూస్తున్నాం. సరేసరి, ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ సినిమాలో పాటకి ఆస్కార్ అవార్ట్ రావడం, జేమ్స్ కేమరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు సైతం మన రాజమౌళిని తలకెత్తుకోవడం తెలుగువారికి పూర్తిగా మత్తెక్కిపోయింది.

ఇంక అక్కడనుంచి ఎవరూ నేలమీద నడవడం మానేశారు. అందరూ పాన్ ఇండియా సినిమాలు, వందల కోట్ల బడ్జెట్ ప్రపంచదేశాలలో షూటింగ్ కార్యక్రమాలు. దీనికి అంతేముంది? కథ డిమాండ్ చేయడమో, లేక దర్శకుడి ఇమేజినేషనో ఏవో అలాటివి కోరితే తప్ప వందల కోట్ల బడ్జెట్ అవసరమేముంది అన్న విచక్షణను తెలుగు సినిమా పరిశ్రమలోని దర్శకులు, హీరోలు కోల్సోయారన్నది తాజాగా పరిశ్రమలో చర్చకొస్తోంది. నిర్మాతలు హీరోలు పేరు చెబితే చాలు హడలిపోతున్నారు. కక్కలేక మింగలేక అన్నట్టుగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారన్నది వాళ్ళ చాటుమాటు గుసగుసలు చెబుతున్నాయి.

బాహుబలి, పుష్ఫ, త్రిబుల్ ఆర్ చిత్రాలకి ముందు కొన్ని సినిమాలు హీరోలవే..సైజబుల్ బడ్జెట్ మీద తయారై బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలను ఇప్పుడు ఆ సదరు హీరోలే మరచిపోవడం శోచనీయం. పరిశ్రమకి ప్రమాదకరం. భారీ ఎత్తున నిర్మాణమైన మెగా సినిమాలనుకున్నవే బాక్సాఫీసు దగ్గర బోర్లా పడి లేవలేకపోయాయి. సమాంతరంగా వచ్చిన విరూపాక్ష, బేబి లాంటి సినిమాలు ఓ మోస్తరు నిర్మాణవ్యయంతో రూపొంది వందకోట్ల క్లబ్లోకి వెళ్ళడం వింత కాదు. నిజం. ఇదే మాట మొన్నీ మథ్య ప్రముఖ రచయిత కోన వెంకట్ ఐ డ్రీమ్ ఛానెల్తో మాట్లాడుతూ దీని గురించి చెప్పి ప్రస్తుత పరిశ్రమ పోకడలను గురించి వివరించారు. ఇలా అయితే కష్టమేనన్నది రమారమి ఆయన సారాంశం. నిజమే.

అవసరమున్నా లేకున్నా బడ్జెట్లు పెట్టించడం, వ్యాపార లావాదేవీలతో ప్రమేయం లేకుండా, నిర్మాత సాథకబాధకాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా, పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నది అన్నట్టుగా తెలుగు సినిమా పరిశ్రమలో భారీ చిత్రాల నిర్మాణ రీతులు పెడదోవ పట్టడం పట్ల ఒక్క కోన వెంకట్ మాత్రమే కాదు, ఇతర నిర్మాతలు కూడా వాపోతున్నారు. కథాబలం ఉన్న చిత్రాలు కొట్టేయంటే అలా ఇలా కొట్టవు. వాటి ఆర్ధికఫలితాలు కూడా ఆషామాషీగా ఉండవు. కానీ, ఇప్పుడు చూపంతా బడ్జెట్లు మీదా, పాన్ ఇండియా రిలీజుల మీదనే సాగుతోంది. గత కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పర్యవసానాలను బేరీజు వేసుకుంటే పరిశ్రమ బైటకు చెప్పుకోలేని పోలీసు దెబ్బలకు గురి అవుతోందన్నది నిజం. ఈ గుణపాఠాలను గుర్తించి, హీరోలే పరిశ్రమకి మార్గనిర్దేశకత్వం చేయాల్సిన చారిత్రక అవసరం ముంచుకొచ్చింది. లేకుంటే నిర్మాతల పరిస్థితి అదోగతేనన్నది పరిశ్రమ ముక్తకంఠం.

Show comments