P Venkatesh
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసేందుకు వందల కి.మీలు ప్రయాణించి పెద్ద సాహసం చేసిన అభిమాని. ఏకంగా 1750 కి.మీలు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు వచ్చి బన్నీని కలిసిన డైహార్డ్ ఫ్యాన్.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసేందుకు వందల కి.మీలు ప్రయాణించి పెద్ద సాహసం చేసిన అభిమాని. ఏకంగా 1750 కి.మీలు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు వచ్చి బన్నీని కలిసిన డైహార్డ్ ఫ్యాన్.
P Venkatesh
ఎవరికి లేని ఫాలోయింగ్ ఒక్క సినీ స్టార్లకే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఎవరో ఒక సినీ హీరోకి ఫ్యాన్ అయ్యే ఉంటారు. అభిమానానికి భాషతో, ప్రాంతంతో సంబంధం లేదంటారు ఫ్యాన్స్. తమ అభిమాన నటుల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తుంటారు ఫ్యాన్స్. తమ హీరో చెప్పే డైలాగ్స్ కు, డ్యాన్స్ లకు ఈలలు వేస్తూ గోల చేస్తుంటారు. సినీ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ హీరోను కలవాలని, ఓ సెల్ఫీ తీసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. తమ అభిమాన నటుడిని కలిసే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. దూరాన్ని కూడా లెక్కచేయకుండా తమ హీరోను కలిసేందుకు వస్తుంటారు. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఖండాలు దాటి మరీ వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారు. హీరోల కోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉండే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు.
ఇదే రీతిలో ఓ అభిమాని తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ ను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఏకంగా అతడు 1,750 కి.మీలు సైకిల్ పై ప్రయాణించి ఐకాన్ స్టార్ ను కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ క్రేజ్ మరింత పెరిగింది. అది ఎంతలా అంటే విదేశీయులు సైతం అల్లు అర్జున్ కు అభిమానులు అయ్యేంత. అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ కు ఫ్యాన్స్ ఊగిపోయారు. క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ఆ డైలాగ్ ను తెగ వాడేసుకున్నారు.
దీంతో ఆ డైలాగ్ ట్రెండింగ్ మారింది. పుష్పలో నటనకు గాను బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వరించిన విషయం తెలిసిందే. పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. మరి ఫారిన్ లోనే ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటే మరి స్వదేశంలో ఏ రేంజ్ లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో యూపీలోని అలీగఢ్ కు చెందిన ఓ వ్యక్తి అల్లు అర్జున్ కు వీరాభిమాని. బన్నీని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సైకిల్ పై హైదరాబాద్ కు బయలుదేరాడు. 1750కి.మీలు ప్రయాణించి తన అభిమాన నటుడు ఐకాన్ స్టార్ ను కలిశాడు. దీంతో అతని అభిమానానికి అల్లు అర్జున్ ఫిదా అయిపోయాడు. తనను కలిసేందుకు వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చిన అభిమానిని చూసి బన్నీ ఎమోషనల్ అయ్యాడు.
అతన్ని అప్యాయంగా పలకరించాడు. అతని గురించి, కుటుంబ సభ్యుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. పుష్ప-2 ప్రమోషన్స్ కోసం యూపీకి వస్తే కచ్చితంగా కలుస్తానని అల్లు అర్జున్ అతనితో అన్నారు. డైహార్డ్ ఫ్యాన్ అయిన అతనికి బన్నీ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి కడుపు నిండా మంచి భోజనం పెట్టించాడు. ఆ తర్వాత అతడిని తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించాడు. ఇది తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది మా ఐకాన్ స్టార్ రేంజ్ అంటే అంటూ మురిసిపోతున్నారు. ఇక ఇప్పుడు అంతా పుష్ప-2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ క్రేజ్ మరింత పెరుగుతుందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి యూపీ నుంచి సైకిల్ తొక్కుతూ వచ్చి బన్నీని కలిసిన అభిమానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.