Guntur Kaaram: కారం ఎఫెక్ట్ బాగానే పనిచేసింది

కారం ఎఫెక్ట్ బాగానే పనిచేసింది

ఓ మూవీ తీయాలని ఫిక్స్ అయ్యాక.. ముహుర్తాలు చూసుకుని చిత్రీకరణ స్టార్ట్ చేస్తారు. అలాగే సినిమా పేరు కూడా రిజిస్టర్ చేయిస్తారు. మనిషికి పేరు బలం ఉన్నట్లే.. సినిమాలకు ఆ సెంటిమెంట్ ఉంటుంది. అందుకే పేరు ఫిక్స్ చేసే సమయంలో ఆచితూచి అడుగులు వేస్తారు దర్శక, నిర్మాతలు.. లేదంటే..

ఓ మూవీ తీయాలని ఫిక్స్ అయ్యాక.. ముహుర్తాలు చూసుకుని చిత్రీకరణ స్టార్ట్ చేస్తారు. అలాగే సినిమా పేరు కూడా రిజిస్టర్ చేయిస్తారు. మనిషికి పేరు బలం ఉన్నట్లే.. సినిమాలకు ఆ సెంటిమెంట్ ఉంటుంది. అందుకే పేరు ఫిక్స్ చేసే సమయంలో ఆచితూచి అడుగులు వేస్తారు దర్శక, నిర్మాతలు.. లేదంటే..

సినిమా టైటిల్స్ కొన్నిటి మూవీల మీద ప్రభావం ఉంటుందంటే నమ్మాలి. గతంలో కూడా రాజబాబు తీసిన మనిషి రోడ్డున పడ్డాడు తర్వాత రాజబాబు కెరీర్ నిజంగానే జారిపోయింది. యమపాశం సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత నిర్మాత పోయి, టైటిల్ వీరభద్రుడుగా మార్చేశారు. సినిమా పరిశ్రమ చాలా సెంటిమెంటల్ వరల్డ్. ఇప్పుడు గుంటూరు కారం టైటిల్. చాలా ఘాటుగా, తినలేంత కారంగా ఉండేదాన్నే గుంటూరు కారంలా అంటుంటారు. గుంటూరు మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. గుంటూరు వంటలు కూడా అంతే కారంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ గుంటూరు కారం ఘాటు సినిమాకి కూడా పట్టేసిందేమో అనిపించకమానదు.

ఇటీవలి రోజులలో ఎన్నో కాంట్రవర్సీలు గుంటూరు కారం చిత్రానికి సంబంధించి బయటకు వచ్చాయి. సోషల్ మీడియా ఎన్నో రకాల కథనాలను బయటకు తీసుకువచ్చి సినిమా పట్ల తీవ్రమైన గందరగోళాన్ని పుట్టించింది. తమన్ చేసిన పాటలు హీరో మహేష్ బాబుకి నచ్చలేదని, తమన్ మీద సీరియస్ అయ్యాడని, కథ కూడా అంతగా మహేష్ ని ఆకట్టుకోలేదని, అందుకు అనేకసార్లు మార్పుచేర్పులు చేశారని..ఇలా ఒకటి కాదు, రెండు కాదు రోజుకో ఉదంతాన్ని సోషల్ మీడియా రాస్తూ వచ్చింది. ముఖ్యంగా కూల్ పీపుల్ గా పరిశ్రమలో పేరుపడిన గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాకి ఇటువంటివి అసలు బయటకు రానేకూడదు. హైలీ ఆర్గనైజ్డ్ గా ఉండే ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాకి ఏ ఒక్క చిన్నపాటి కాంట్రవర్సీ రావడం విడ్డూరంగా ఉంటుంది.

 అసలు తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టడం మహేష్ కి సుతారము ఇష్టం లేకపోయినా, అలవైకుంఠపురం సెంటిమెంట్ తో త్రివిక్రమ్ మహేష్ ని ఒప్పించి మరీ తమన్ నే ఫిక్స్ చేశాడు. తర్వాత విడుదలైన సాంగ్స్ పట్ల ఫ్యాన్స్ కూడా తీవ్రమైన నిరాశకు గురై, తారాస్థాయిలో ప్రతిస్పందించినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. దానికి తోడు సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అనాలోచితంగా, అనుచితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మీద నోరు పారేసుకున్నాడని మరో పితూరి లేచింది. అలాగే చిత్రనిర్మాత నాగవంశీ కూడా ఏ మాత్రం తగ్గకుండా యానిమల్ మూవీలో చివరి షాట్ క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కలకలం రేపాడని మరో వివాదం. సాంగ్స్ విషయంలో తన అభిమానులు కించపడే విధంగా టీం ప్రవర్తించినందుకు మహేష్ గట్టిగానే రియాక్ట్ అయ్యాడని కూడా వైరల్ అయింది. తన మాటలను పట్టించుకోలేదని ఆగ్రహించిన మహేష్ షూటింగ్ నుంచి కూడా కోపంగా వెళ్ళిపోయాడని గుసగుసలాడుకున్నారు. ఇన్ని వార్తలు బయటకు రావాల్సిన సినిమానా ఇది? గుంటూరు కారం టైటిల్ ఎఫెక్ట్ కాకపోతే.

Show comments