Krishna Kowshik
హీరో, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా నటనలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరిన చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు.
హీరో, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా నటనలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరిన చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు.
Krishna Kowshik
ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. 1943లో కృష్ణాజిల్లా పడిమి ముక్కలలో జన్మించిన ఆయన.. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో శనివారం తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్ర శేఖర్. ఆయన 932పైగా చిత్రాల్లోనటించారు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. అప్పటి తరం నటుల నుండి ఇప్పటి తరం నటుల వరకు వారధిగా ఉన్నారు. సుమారు 150-170 చిత్రాల్లో హీరోగా నటించారు. మిగిలిన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. చంద్రమోహన్ ఇక లేరన్న వార్త సినీ లోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
చంద్ర మోహన్ విలక్షణ నటుడే కాదూ లక్కీ హ్యాండ్ అన్న పేరు ఇండస్ట్రీలో పాతుకుపోయింది. కారణం ఆయనతో పని చేసే హీరోయిన్లు టాప్ స్థాయికి దూసుకెళ్లడమే. ఒకప్పటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి.. హీరోయిన్‌గా తొలి సినిమా ఆయనతోనే చేసింది. పదహారేళ్ల వయస్సులో వీళ్లిద్దరూ కలిసి నటించిన సంగతి విదితమే. ఆ ఒక్కరే కాదూ జయప్రద, జయసుధ, చంద్రకళ, విజయనిర్మల, వాణిశ్రీ రాధిక, రాధ, విజయ శాంతి వంటి నటీమణులు ఆయనతో చేశాకే స్టార్ హీరోయిన్లు అయ్యారు. అంతేకాదూ.. చిత్ర పరిశ్రమలో ఎవరైనా నిర్మాతగా రాణించాలంటే తొలుత చంద్రమోహన్‌తో సినిమా చేసేవారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు పూర్తి చేయడమే కాకుండా.. చెప్పిన సమయానికి ఠంచనుగా షూటింగ్ కు వచ్చిన నిర్మాతల హీరోగా మారారు.
మినిమం గ్యారెంటీ హీరోతో పాటు ఆయన చేత్తో డబ్బులు తీసుకున్నా, ఇచ్చినా అదృష్ట కలిసి వస్తుందని బలంగా విశ్వసించేవారు. అందుకు ఉదాహరణ ఇప్పుడు బడా నిర్మాతగా వెలుగొందుతున్న అశ్వినిదత్. ఆయన ప్రొడ్యూసర్‌గా తొలి చిత్రం ఓ సీత కథలో హీరో చంద్రమోహనే. ఏడిద నాగేశ్వరరావు మొదటి చిత్రం సిరిసిరి మువ్వ హీరో కూడా ఈ లక్కీమ్యానే. అందుకే ఆయనతో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపించేవారు దర్శక నిర్మాతలు. రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చంద్రమోహన్. అందుకే ఆయన హీరో కాకపోయినా.. నిర్మాతలు సినిమా తీస్తున్నారంటే.. ఆయన దగ్గర నుండి రూపాయి తీసుకునేవారట. అలా తీసుకుంటే లక్ కలిసి వస్తుందని నమ్మేవారట. మొత్తానికి తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన తార.. ధృవతారగా నింగికి ఎగసింది.