Sanjay Gadhvi Passed Away: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో ఒక్కోటిగా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మరణంనుంచి తేరుకోక ముందే ప్రముఖ దర్శకుడు మరణించారు...

చిత్ర పరిశ్రమలో ఒక్కోటిగా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మరణంనుంచి తేరుకోక ముందే ప్రముఖ దర్శకుడు మరణించారు...

భారత చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన దిగ్గజ నటులు, దర్శకులు చనిపోతున్నారు. ఈ నెల నవంబర్‌ 11న ప్రముఖ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా షుగర్‌ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆయన ఆరోగ్య క్షీణించటంతో .. నవంబర్‌ 11న తుది శ్వాస విడిచారు. 78 ఏళ్ల వయసులో పరమపదించారు.

ఈ విషాదంనుంచి తేరుకోక ముందే ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత రవీంద్ర బాబు చనిపోయారు. రవీంద్ర బాబు నిర్మాతగా తెలుగులో 17 సినిమాలను తెరకెక్కించారు. మా నాన్న నక్సలైట్, వెయిటింగ్ ఫర్ యూ, సొంతూరు, గల్ఫ్, గంగపుత్రులు, హనీట్రాప్‌తో పాటు మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ కొద్దిరోజులకే ప్రముఖ తమిళ రచయిత రాశి తంగదురై మరణించారు. పలు తమిళ సినిమాలకు రచయితగా పని చేసిన అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు.

ఇలా చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్న నేపథ్యంలోనే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గాధ్వీ మరణించారు. గుండె పోటు కారణంగా ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముంబైలోని లోఖండ్‌ వాలా ప్రాంతంలో మార్నింగ్‌ వాక్‌లో ఉన్న ఆయనకు అనుకోని విధంగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. దీంతో ఆయన్ని కోకిలాబెన్‌ అంబానీ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా గుండె పోటు వచ్చినట్లు తేల్చారు. సంజయ్‌ మరణం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంజయ్‌ మరణంపై స్పందిస్తున్నారు. తమ సంతాపం తెలుపుతున్నారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సంజయ్‌ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

కాగా, సంజయ్‌ బాలీవుడ్‌లో పలు హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. 2004లో ధూమ్‌, రెండేళ్ల తర్వాత 2006లో ధూమ్‌ 2 సినిమాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు దేశ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని నమోదు చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన 2000లులో వచ్చిన ‘ తేరే లియే’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘మేరే యార్‌ కి షాదీ హై, తేరే లియే, కిడ్నాప్‌, అజబ్‌ గజబ్‌ లవ్‌, సినిమాలకు దర్శకత్వం వహించారు. 2020లో ‘ ఆపరేషన్‌ పరిందే’ సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Show comments